Telangana Omicron: ఇక నుంచి mask లేకపోతే.. అంతే.. CS సోమేష్ కుమార్ సీరియ‌స్

By Rajesh K  |  First Published Jan 1, 2022, 10:57 PM IST

Telangana Omicron:  ఒమిక్రాన్ కేసులు  పెరుగుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర‌  ప్రధాన కార్యదర్శి  సోమేష్ కుమార్ శనివారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సంబంధిత ఉన్నతాధికారులతో ఉన్నత స్ధాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితిని సమీక్షించారు.  కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించని వారిపై రూ.1000 జరిమానా విధించే ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని సోమేష్ కుమార్ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. 
 


Telangana Omicron : ప్రపంచ దేశాల‌ను గడగడలాడిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ భయాందోళనలు తీవ్ర‌మ‌వుతోన్న వేళ మ‌న దేశంలోనూ కరోనా కొత్త వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణలోనూ ఒమిక్రాన్ వేరియంట్ త‌న పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. తాజాగా  తెలంగాణ‌లో మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో న‌మోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 79కి చేరినట్లు పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ..  కోవిడ్ పరిస్ధితులు, ఒమిక్రాన్ కేసులు  పెరుగుద‌ల‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బి.ఆర్.కె.ఆర్ భవన్ లో నిర్వ‌హించిన ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు  పాల్గొన్నారు. 

ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితుల‌పై సుదీర్ఘంగా చర్చించారు. దేశంలో ఆయా రాష్ట్రాల్లో, వివిధ విదేశాల్లో ఒమైక్రాన్ ను  ఏవిధంగా క‌ట్ట‌డి చేస్తోన్నారు. వారు ఏ విధ‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారనే అనే ఆంశాల‌పై చర్చించారు. మ‌న‌ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా చర్చించారు.  ఈ వేరియంట్  వ్యాప్తికి అడ్డు క‌ట్ట‌వేయాల‌ని , అందుకోసం క‌చ్చితంగా   ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. 

Latest Videos

undefined

Read Also:తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. కొత్తగా 12 మందికి పాజిటివ్, 79కి చేరిన సంఖ్య

ఇప్పటికే  రాష్ట్ర‌ ప్రభుత్వం కోవిడ్ వ్యాప్తిని నివారించడానికి రాష్ట్రంలో మతపరమైన, రాజకీయ మరియు సాంస్కృతిక సంబంధిత కార్యక్రమాలతో సహా అన్ని రకాల ర్యాలీలు, బహిరంగ సమావేశాలను, ర్యాలీలను నిషేధించిందని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వాటికి అనుమతి ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేశారు.అన్ని కార్యక్రమాలపై ఈ నెల 10వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే.. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, షాప్స్, మాల్స్, ప్రభుత్వ , ప్రైవేట్ కార్యాలయాలు పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ శానిటైజర్ ద్వారా చేతులు శుభ్రం చేసుకోవాలన్న నిబంధనలు కూడా పాటించాలని ఆదేశించినట్టు తెలిపారు. అంతేకాదు కార్యాలయాలు, పాఠశాల ఆవరణలను తరచుగా శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని... ఆయా ఎంట్రీ పాయింట్ లోనే థర్మోస్క్రీనింగ్, థర్మల్ స్కానర్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

Read Also: షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌ ప్రారంభించిన కేటీఆర్.. ఆ రోడ్లు తెరిపించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రిక్వెస్ట్

పాఠశాలలు, వివిధ ఇన్ స్టిట్యూషన్లలో కూడా సిబ్బంది, విద్యార్థులు మాస్కులు ధరించి కోవిడ్ నిబంధనలను పాటించేలా చూడాలని ఆదేశించినట్టు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు ధరించని వారిపై 1000 జరిమానా విధించాలని అన్నారు.దీనిని ఖచ్చితంగా అమలుచేయాలని సీఎస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. సీనియర్ సిటిజన్లు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు జాగ్రత్తలు పాటించాలని  సోమేష్ కుమార్  పేర్కొన్నారు.  ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ,డైరెక్టర్ ఆఫ్ హెల్త్ , డీఎంఈ రమేష్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు. 

click me!