తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా కలకలం రేగింది. పలు విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలోని చల్మెడ మెడికల్ కాలేజీలో 39 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో.. ఒక్కసారిగా కలకలం రేగింది
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనకు గురి చేస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఈ కొత్త వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 38 దేశాలకు విస్తరించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. దీంతో ప్రపంచదేశాలు పానిక్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. గతంలో లాగా మారణ హోమాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాయి. భారత్ లో కూడ ఈ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 4 కేసులు బయటపడ్డాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు కఠినతరం చేశాయి.
ఇదిలా ఉంటే.. మరోవైపు మన రాష్ట్రంలో కరోనా కలవరపెడుతోంది. గతంలో లాగా.. కరోనా విజృంభిస్తోంది. భయోత్పాతాలు సృష్టిస్తోంది. కరీంనగర్‌లో మళ్లీ కరోనా వైరస్ కలకలం రేగింది. పలు విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని చల్మెడ మెడికల్ కాలేజీలో 39 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు కళాశాల యాజమాన్యం ప్రకటించింది. దీంతో.. ఒక్కసారిగా కలకలం రేగింది. మిగతా విద్యార్థులకు కరోనా టెస్ట్‌లు చేస్తున్నారు. అనుమానం ఉన్న విద్యార్థులు హోం క్వారెంటెన్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా కాలేజీకి సెలవులు ప్రకటించింది యాజమాన్యం. వారం రోజుల క్రితం కాలేజీలో వార్షికోత్సవం జరిగింది. ఆ సమయంలో కరోనా లక్షణాలన్న ఒకరిద్దరు విద్యార్థుల నుంచి మిగిలిన వారికి వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో స్థానికంగా ఆందోళన రేకెత్తిస్తోంది
Read Also: https://telugu.asianetnews.com/coronavirus-telangana/if-you-want-ration-you-have-to-be-vaccinated-telangana-government-decision-in-the-background-of-omricon-r3mnya
మరోవైపు రాజేంద్రనగర్ బండ్లగూడ మున్సిపాలిటీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. పీరం చెరువు పరిధిలోని గిరిధారి అపార్ట్‌మెంట్‌లో 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలిసింది. ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ద్వారా ఆ అపార్ట్‌మెంట్ వాసులకు కరోనా సోకినట్టు తెలుస్తోంది. అనంతరం ఆ అపార్ట్‌మెంట్‌లో పలువురికి పరీక్షలు చేయగా మొత్తంగా 10 మందికి కరోనా సోకినట్లు తేలింది.
undefined
Read Also: https://telugu.asianetnews.com/telangana/189-new-corona-cases-reportd-in-telangana-r3hyit
అలాగే.. సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, ముత్తంగి గురుకులాల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇలా విద్యాసంస్థల్లో మరోసారి కరోనా కలకలం సృష్టించడంతో విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కొందరు విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా.. కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. కోవిడ్ బాధితులు క్వారంటైన్ కి వెళ్లారు. అప్రమత్తం అయిన అధికారులు ముందు జాగ్రత్తగా మిగతా విద్యార్థులకు కూడా కోవిడ్ నిర్ధారణ టెస్టులు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మన రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు లేవని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా, విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి 13 మంది శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం పంపుతున్నట్లు ఓ ప్రకటించారు. ఇలా రాష్ట్రంలో ఓ వైపు కరోనా టెన్షన్.. మరోవైపు ఒమిక్రాన్ లు భయాందోళనలకు గురి చేస్తోంది. రాష్ట్ర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం మేలు.