నాడు ఉద్యమకారుల రక్తం చూసినవారంతా నేడు కేసీఆర్‌తోనే: ఈటల ఫైర్

By narsimha lodeFirst Published Jul 10, 2021, 2:43 PM IST
Highlights

మాజీ మంత్రి ఈటల రాజేందర్  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. నాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల రక్తం చూసినవారంతా నేడు కేసీఆర్ వెంట ఉన్నారన్నారు. హుజూరాబాద్ లో దొంగ ఓటర్లను చేర్పిస్తున్నారని టీఆర్ఎస్ పై ఆయన విమర్శలు గుప్పించారు. చట్టప్రకారంగా వ్యవహరించని అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 
 

హుజూరాబాద్: ఇతర ప్రాంతాల వారిని హుజూరాబాద్ లో ఓటర్లుగా  చేరుస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. టీఆర్ఎస్‌కు ఓట్లు రావనే భయంతోనే  ఒక్కో ఇంట్లో 30 నుండి 40 దొంగఓట్లు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు.శనివారం నాడు ఆయన హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే  టీఆర్ఎస్  ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని ఆయన మండిపడ్డారు.

ఉద్యమకారుల రక్తాన్ని చూసినవారు కేసీఆర్ వెంట ఉన్నారని ఆయన గుర్తు చేశారు. మీ ఓటును తొలగించకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఆయన ప్రజలను కోరారు. అధికారులు బాధ్యత మరిచి వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. టీఆర్ఎస్ అరాచకాలకు సహకరించే అధికారులకు ఈసీకి ఫిర్యాదు చేస్తామని  ఆయన  చెప్పారు. హుజూరాబాద్, జమ్మికుంటల్లో దొంగఓట్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. 

గత నెలలో  ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అంతేకాదు హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి కూడ ఆయన రాజీనామా సమర్పించారు.  స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈటల రాజీనామాను ఆమోదించారు. ఆరు మాసాల్లో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశ ఉంది. ఇప్పటికే ఈటల రాజేందర్  నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.


 

click me!