లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన: తూర్పు గోదావరిలో ఫాస్టర్ అరెస్ట్

By narsimha lodeFirst Published Apr 5, 2020, 12:06 PM IST
Highlights

తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో చర్చిలో ప్రార్ధనలు నిర్వహించిన ఫాస్టర్ ను పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు.
 


రాజమండ్రి:తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో చర్చిలో ప్రార్ధనలు నిర్వహించిన ఫాస్టర్ ను పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు.

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు  అమల్లో ఉన్నాయి. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ రాయవరంలో చర్చిలో ఓ ఫాస్టర్  ఆదివారం నాడు తెల్లవారుజామున ఉపవాస ప్రార్ధనలు నిర్వహించారు.

తెల్లవారుజామునే చర్చిలో ప్రార్ధనలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు చర్చికి వెళ్లారు. అప్పటికే ఆ చర్చిలో  సుమారు 150 మంది సామాజిక దూరం పాటించకుండానే ఆ చర్చిలో ఉన్నారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.

నిబంధనలకు విరుద్దంగా ఎలా ప్రార్ధనలు నిర్వహించారని పోలీసులు ఫాస్టర్ ను ప్రశ్నించారు. అయితే ఈ విషయమై సరైన సమాధానం నిర్వాహకుల నుండి రాలేదు. దీంతో పాస్టర్ విజయరత్నంను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also readఏపీపై కరోనా పంజా: 12 గంటల్లో 34 కొత్త కేసులు, 226కి చేరిన మొత్తం కేసులు

కరోనా వైరస్  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోంది. ఢిల్లీలో ప్రార్థనల్లో పాల్గొని వచ్చినవారి నుండే ఎక్కువగా ఈ కేసులు ఎక్కువగా నమోదైనట్టుగా  రికార్డులు చెబుతున్నాయి. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ  ఫాస్టర్ నిర్వహించడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
 

click me!