జగన్ కొరడా: ప్రభుత్వ, ప్రైవేట్ సర్వీసులపై ఎస్మా ప్రయోగం

By Siva Kodati  |  First Published Apr 3, 2020, 6:37 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా  కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వైద్యం, అత్యవసర సేవలను ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది. ఆరు నెలల పాటు వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, రవాణా ఎస్మా పరిధిలోకి వస్తాయి. 


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా  కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వైద్యం, అత్యవసర సేవలను ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది.

ఆరు నెలల పాటు వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, రవాణా ఎస్మా పరిధిలోకి వస్తాయి. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని జీవోలో పేర్కొన్నారు.

Latest Videos

Also Read:ఏపీలో కోరలు చాస్తున్న కరోనా: సీఎం జగన్‌కు బాబు లేఖ, కీలక సూచనలు

ఎస్మా పరిధిలోకి డాక్టర్లు, వైద్య సిబ్బందితో పాటు వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణాను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్మా పరిధిలోకి తీసుకొచ్చింది.

కాగా శుక్రవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరింది. వీటిలో 140 మంది ఢిల్లీ నిజాముద్దీన్‌లో మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే. అలాగే ఏపీకి విదేశాల నుంచి 28 వేలమందికి పైగా వచ్చారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: ఏపీలో 40 ఏసీ రైల్వే కోచ్‌ల్లో ఐసోలేషన్ వార్డులు సిద్దం

విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా  కేసులు తక్కువగా వుండగా.. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో మాత్రం కరోనా కేసులు ఎక్కువగా ఉండటం గమనార్హం. మరోవైపు మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం కోరింది.

అలాగే రాష్ట్రంలోని నాలుగు చోట్ల కరోనా వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకమైన ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. నియోజకవర్గ కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా ప్రభుత్వం స్పెషల్ హాస్పిటల్స్‌ను సిద్ధం చేసింది. 

click me!