వ్యవసాయ పనులకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చెప్పారు.
అమరావతి:వ్యవసాయ పనులకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చెప్పారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ పై సీఎం వైఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వివరాలను ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆళ్ల నాని శుక్రవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని వచ్చినవారిలో 140 మందికి కరోనా వైరస్ సోకిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టికి 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా ఆయన తెలిపారు. ఢిల్లీలో మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొనేందుకు 1085 మంది వెళ్లారన్నారు. వారిలో 946 మంది రాష్ట్రానికి తిరిగి వచ్చారన్నారు. మిగిలిన వారు ఇతర ప్రాంతాల్లో ఉన్నట్టుగా గుర్తించామన్నారు.
లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు ఆకలితో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొందన్నారు.వలస కార్మికుల కోసం రాష్ట్రంలో 236 క్యాంపులను ఏర్పాటు చేశామన్నారు.
ఈ క్యాంపుల్లో ఉండే కార్మికుల కోసం ఆకలితో ఇబ్బందికి గురికాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొన్నామన్నారు డిప్యూటీ సీఎం. ఈ క్యాంపుల్లో సుమారు 78 వేల మంది ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
Also read:ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 161: 140 కేసులు ఢిల్లీ నుండి వచ్చినవారే
ఈ 78 వేల మందిలో 16 వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా భోజన వసతిని కల్పిస్తున్నామన్నారు. ఈ కార్మికులు పనిచేసే సంస్థలతో చర్చించి వారితోనే భోజనవసతిని కల్పించేలా చర్యలు తీసుకొనేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొందని చెప్పారు.ఎక్కడ ఉన్నవారికి అక్కడే రేషన్ సరఫరా చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని డిప్యూటీ సీఎం తెలిపారు.