కరోనా పై పోరాటం... బాలకృష్ణ భారీ విరాళం

By telugu news teamFirst Published Apr 3, 2020, 12:59 PM IST
Highlights

ఇప్పటికే సినిమా స్టార్స్ చాలామంది ముందుకు వచ్చి విరాళం అందించారు.  సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే ముందుకు వచ్చి తన వంతు సహాయం అందించారు.  రూ.1.25 కోట్ల విరాళం అందించారు.  
 

కరోనా వైరస్ దేశాన్ని పట్టి పీడిస్తుంది. లాక్ డౌన్ కి ముందు కేవలం కరోనా కేసులు పదుల సంఖ్యలో మాత్రమే ఉండేవి. మూడు వారాల పాటు లాక్ డౌన్ ప్రకటిస్తే.. పరిస్థితి అదుపులోకి వస్తుందని అందరూ భావించారు. కానీ పరిస్థితి మొత్తం అదుపు తప్పింది. బాధిుతల సంఖ్య వేలల్లోకి పెరిగింది.

 ఈ మహమ్మారి వలన దేశంలో 79 మంది మరణించగా, 2400 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు.  ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి.  లాక్ డౌన్ ప్రక్రియను సమర్దవంతంగా అమలు చేస్తున్నాయి.  

Also Read ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 161: 140 కేసులు ఢిల్లీ నుండి వచ్చినవారే...

అయితే, ప్రభుత్వాలు చేస్తున్న ఈ ప్రయత్నానికి తాము సైతం చేదోడు వాదోడుగా ఉంటామని సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు.  ఇప్పటికే సినిమా స్టార్స్ చాలామంది ముందుకు వచ్చి విరాళం అందించారు.  సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే ముందుకు వచ్చి తన వంతు సహాయం అందించారు.  రూ.1.25 కోట్ల విరాళం అందించారు.  

అందులో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్ ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి కళ్యాణ్ కు అందించారు. 

కరోనా పై పోరాటానికి తన వంతు బాధ్యతగా 1 కోటి 25 లక్షల విరాళంగా అందిస్తున్నట్టు నందమూరి బాలకృష్ణ తెలిపారు. స్వయం నిబంధనలతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని, కరోనా ని అరికట్టడంలో మనందరం భాగస్తులం కావాలని పిలుపునిచ్చారు.

click me!