తాడిపత్రిలో విషాదం: నవదంపతుల ఆత్మహత్య

Published : Aug 08, 2023, 09:57 AM IST
తాడిపత్రిలో విషాదం: నవదంపతుల ఆత్మహత్య

సారాంశం

పెళ్లైన  ఐదు మాసాలకే  నవదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తాడిపత్రిలో  విషాదాన్ని నింపింది.  నిన్న భార్య ఆత్మహత్య చేసుకొంది. ఇవాళ భర్త సూసైడ్ చేసుకున్నాడు.

అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో  నవ దంపతులు  ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తాడిపత్రిలో విషాదాన్ని నింపింది. ఐదు నెలల క్రితం రమాదేవి, మంజునాథ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే  వీరిద్దరి మధ్య  ఏం జరిగిందో ఏమో కానీ  రమాదేవి ఈ నెల 7వ తేదీన ఆత్మహత్య చేసుకుంది.  దీంతో  మనోవేదనకు గురైన  మంజునాథ్ ఇవాళ   ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ ఘటన  స్థానికంగా కలకలం రేపుతుంది.

దేశ వ్యాప్తంగా  పలు రాష్ట్రాల్లో  ఆత్మహత్య ఘటనలు ప్రతి రోజూ అనేకం చోటు  చేసుకుంటున్నాయి. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు  చేసుకుంటున్న  ఘటనలు ఆందోళనలు కల్గిస్తున్నాయి.  సమస్యలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని  మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

అసోం  రాష్ట్రంలో  అక్కా చెల్లెళ్లపై కొందరు అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలోని కామరూప్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో మనోవేదనకు గురైన బాధితులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ ఘటన ఈ నెల 7వ తేదీన  చోటు  చేసుకుంది.

షేర్ మార్కెట్ లో నష్టపోవడంతో  బెంగుళూరులో నివాసం ఉంటున్న ఏపీ రాష్ట్రానికి చెందిన మచిలీపట్టణానికి  చెందిన వీరాంజనేయ విజయ్  భార్య, పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.ఈ నెల 6న  ఈ  ఘటన చోటు చేసుకుంది.ఈ నెల 5వ తేదీన  తెలంగాణ అసెంబ్లీ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అదే రోజున న్యూఢిల్లీలోని  నోయిడాలో భార్యాభర్తలు  ఆత్మహత్య చేసుకున్నారు. 

ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావు

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.

PREV
click me!

Recommended Stories

మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్.. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి రూ.41.50లక్షల సాయం...
కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు చేతికర్ర: టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి