ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 135కి పెరిగింది. మర్కజ్ వెళ్లి వచ్చినవారిలో 91 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 135కి పెరిగింది. ఇంతకు ముందు 24 గంటల్లో కొత్తగా 21 కేసులు నమోదైన విషయం తిలెసిందే. దీంతో గురువారం ఉదయానికి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 132కు పెరిగింది.
ఏపీలో మూడు నాలుగు రోజులుగా కరోనా తన పంజా విప్పుతోంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారే ఎక్కువ సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడ్డారు. గురువారం ఉదయం 9 గంటల తర్వాత మరో మూడు కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీలోని మర్కజ్ లో పాల్గొన్ని 1085 మంది తిరిగి రాగా, వారిలో 758 మందికి పరీక్షలు నిర్వహించారు. కడప, గుంటూరు, విశాఖల్లో ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో శాంపిల్స్ పరీక్షల సామర్యం 450 నుంచి 570కి పెరుగుతుంది. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చినవారిలో 91 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.
గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు కాలేదు. ప్రకాశం జిల్లాలో కూడా ఎక్కువగానే కేసులు నమోదయ్యాయి.