కరోనా మహమ్మారిని అరికట్టడంలో ఏపి ప్రభుత్వానికి సహకరించడానికి ప్రభుత్వోద్యుగు ముందుకు వచ్చారు.
అమరావతి: కోవిడ్ 19 నియంత్రణ చర్యల కోసం పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖలు భారీ విరాళాన్ని ప్రకటించాయి. సీఎం సహాయనిధికి ఏకంగా రూ. 200.11 కోట్ల విరాళం ప్రకటించారు. ఉద్యోగుల తరపున విరాళం చెక్కులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అందజేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
జిల్లా మైనింగ్ ఫండ్ నుంచి రూ. 187 కోట్లు, ఏపీఎండీసీ నుంచి రూ. 10.62 కోట్లు, మైన్స్ అండ్ జియాలజీ శాఖ ఉద్యోగుల విరాళం రూ. 56 లక్షలు, ఉపాధి హామీ, వాటర్ షెడ్ శాఖ ఉద్యోగుల విరాళం రూ. 1.50 కోట్లు, సెర్ప్ ఉద్యోగుల విరాళం రూ. 50 లక్షలు అందించారు.
చెక్కుల పంపిణీ కార్యక్రమం లో మంత్రితో పాటు పాల్గొన్న రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామ్ గోపాల్, సెర్ఫ్ సిఇఓ రాజబాబు, ఎపిఎండిసి మదుసూదన్ రెడ్డి, డిజిఎం వెంకటరెడ్డి తదితరులు తెలిపారు.