కరోనాను జయించిన రాజమండ్రి యువకుడు, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్

By narsimha lode  |  First Published Apr 3, 2020, 12:00 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ బాధితుడు కోలుకొన్నాడు. శుక్రవారం నాడు ఉదయం ఆయన  ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. జిల్లా కలెక్టర్, ఎస్పీ  ఆ యువకుడిని అభినందించారు.


రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ బాధితుడు కోలుకొన్నాడు. శుక్రవారం నాడు ఉదయం ఆయన  ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. జిల్లా కలెక్టర్, ఎస్పీ  ఆ యువకుడిని అభినందించారు.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన యువకుడు లండన్ నుండి మార్చి 17వ తేదీన ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆ యువకుడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయనను కాకినాడ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించారు.

Latest Videos

undefined

ఈ యువకుడికి చెందిన నలుగురు కుటుంబసభ్యులతో పాటు  ఆయనతో సన్నిహితంగా ఉన్న మరో 12 మందికి కూడ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ 16 మందికి కరోనా సోకలేదు.

Also read:ఏపీపై కరోనా దెబ్బ: కొత్తగా 12 కేసులు, మొత్తం కేసులు 161కి చేరిక

యువకుడి నివాసానికి 500 మీటర్ల వరకు అధికారులు జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ ప్రాంతం వైపు ఎవరూ కూడ వెళ్లకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కరోనా నుండి లండన్ నుండి వచ్చిన యువకుడు కోలుకోవడంతో జిల్లా అధికారులు దగ్గరుండి అతడిని శుక్రవారం నాడు ఉదయం ఇంటికి పంపారు. ఇంటి వద్ద కూడ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు అతడికి సూచించారు.

click me!