ఏపీపై కరోనా దెబ్బ: కొత్తగా 12 కేసులు, మొత్తం కేసులు 161కి చేరిక

By narsimha lode  |  First Published Apr 3, 2020, 10:46 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం నాడు  మరో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 161కి చేరుకొంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదు కావడానికి ఢిల్లీ నుండి వచ్చిన వారే కారణమని రాష్ట్ర ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం నాడు  మరో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 161కి చేరుకొంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదు కావడానికి ఢిల్లీ నుండి వచ్చిన వారే కారణమని రాష్ట్ర ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో ఇవాళ ఒక్క రోజే 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ఇవాళ ఒక్క రోజే 8 కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 1, విశాఖపట్టణంలో మరో మూడు కేసులు నమోదయ్యాయి. గురువారం నాడు ఒక్క రోజే సుమారు 38 కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Latest Videos

ఏపీ రాష్ట్రంలో  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ కు వెళ్లిన వచ్చినవారి నుండే ఎక్కువగా ఉందని ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో పాటు ఆ కుటుంబసభ్యులను, వారితో సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్ కు తరలించారు అధికారులు.

రాష్ట్రానికి విదేశాల నుండి సుమారు 28 వేలకు పైగా వచ్చారు. విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి వారికి కూడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విదేశాల నుండి వచ్చిన వారి కంటే ఢిల్లీ నుండి వచ్చిన వారి నుండే ఎక్కువగా వ్యాప్తి చెందింది. రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడికి తొలిసారిగా కరోనా పాజిటివ్ నమోదైంది. అయితే ఆ యువకుడిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స నిర్వహించారు. ఇటీవలనే ఆయన కోలుకొని ఇంటికి వెళ్లిపోయాడు.

Also read:ఆంధ్రప్రదేశ్ ను కలవరపెడుతున్న కరోనా, 152కు పెరిగిన కేసుల సంఖ్య

అయితే ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే రాష్ట్రంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసులు మాత్రం నమోదు కాలేదు.శ్రీకాకుళం జిల్లా నుండి కూడ ఇటీవల కాలంలో చాలామంది ఢిల్లీ వెళ్లి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. వారికి కూడ పరీక్షలు నిర్వహించనున్నారు. 


జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసులు 

అనంతపురం-2
చిత్తూరు -09
తూర్పుగోదావరి -09
గుంటూరు- 20
కడప- 19
కృష్ణా- 23
కర్నూల్- 1
నెల్లూరు- 32
ప్రకాశం -17
విశాఖపట్టణం- 17
పశ్చిమ గోదావరి -15

click me!