కరోనాపై పోరాటంలో సన్నబియ్యం ముఖ్యమంత్రి ఫెయిల్: బుద్దా వెంకన్న ఫైర్

By Arun Kumar PFirst Published Mar 31, 2020, 2:54 PM IST
Highlights

కరోనా వైరస్ ను అరికట్టడంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తిగా విఫలమయ్యాడని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. 

అమరావతి: లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇంటివద్దే రేషన్ అందిస్తామని హామీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం మాటతప్పిందని టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం నిర్వాకం వల్లే ఓ వృద్దురాలు అన్యాయంగా మృతిచెందిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల్ని క్యూలైన్లలో నిలబెట్టి ప్రాణాలు తీస్తున్న దుర్మార్గ ప్రభుత్వం జగన్ ది అంటూ వెంకన్న మండిపడ్డారు. 

''కరోనాని అరికట్టడంలో వైఎస్ జగన్ గారు ఫెయిల్ అయ్యారని,అసమర్థుడని సన్న బియ్యం ముఖ్యమంత్రి స్వయంగా ఒప్పుకున్నారు. అందుకే ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు రావాలి, కావాలి అంటున్నారు'' అంటూ విమర్శించారు. 
 
''కరోనా ని కట్టడి చెయ్యడానికి చర్యలు తీసుకోవాలి అని వేడుకుంటున్నారు.సన్న బియ్యం మంత్రి బాధ చూస్తుంటే భాదేస్తుంది. తన శాఖలో ఎం జరుగుతుందో కూడా తెలియని అసమర్థత మంత్రి'' అంటూ పరోక్షంగా మంత్రి కొడాలి నానిపై మండిపడ్డారు. 

''రేషన్ షాపుల్లో రేషన్ ఇస్తాం అని శాఖ ప్రకటిస్తే.సన్న బియ్యం మంత్రి ఇంటికే సరుకులు పంపుతా అని ప్రకటించారు.ఆఖరికి ప్రజల్ని క్యూలైన్లలో నిలబెట్టి ప్రాణాలు తీస్తున్న దుర్మార్గ ప్రభుత్వం ఇది'' అని వెంకన్న మండిపడ్డారు. 

click me!