వారి భార్యలకూ కరోనా పాజిటివ్: ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చినవారి లెక్కలు ఇవీ....

By telugu teamFirst Published Mar 31, 2020, 12:26 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన మతప్రార్థనలకు వెళ్లి వచ్చినవారితో ఇతరులకు ఈ వ్యాధి సోకుతున్నట్లు నిర్ధారణ అయింది.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనా కాంటాక్ట్ కేసు నమోదైంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వ్యక్తి ద్వారా విజయవాడలో ఓ మహిళకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రార్థనలకు 711 మంది వెళ్లి వచ్చినట్లు భావిస్తున్నారు. దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఒక్క రోజే 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉన్నారు. 189 మంది కర్నూలు జిల్లాకు 189 ఉన్నట్లు లెక్కలు తీశారు. అనంతపురం జిల్లాలో పదేళ్ల బాలుడికి కరోనా వైరస్ సోకింది. గుంటూరులో రెండు, కరంపూడిలో ఒక కేసు బయటపడినట్లు గంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ తెలిపారు. ఇప్పటి వరకు 9 కేసులు బయటపడినట్లు ఆయన చెప్పారు. 

also Read: ఏపీపై కరోనా పంజా: ఒక్క రోజే 17 పాజిటివ్ కేసులు, మొత్తం 40కి చేరిక

ఢిల్లీ నుంచి ఇప్పటి వరకు 180 మందిలో 140 మందిని గుర్తించామని, 103 కేసులు చేక్ చేశామని, మిగిలిన 40 మంది కోసం గాలిస్తున్నామని ఆయన చెప్పారు. ఢిల్లీ వెళ్లి వచ్చినవారి భార్యలకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించామని ఆయన చెప్పారు. కరంపూడి, మాచర్ల, గుంటూరుల్లో కర్ఫ్యూ విధించినట్లు ఆయన తెలిపారు. 

ఢిల్లీ నుంచి వచ్చినవారు తమ ఊళ్లలో గల ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమాజహితం కోరి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.

ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్ లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చినవారి సంఖ్య ఇలా ఉంది. 

శ్రీకాకుళం జిల్లా    0
విజయనగరం జిల్లా      3
విశాఖపట్నం రూరల్.   1
విశాఖపట్నం సిటీ.     41
తూర్పు గోదావరి జిల్లా     6
పశ్చిమ గోదావరి జిల్లా   16
రాజమండ్రి.             21
కృష్ణ జిల్లా.              16
విజయవాడ సిటీ.      27
గుంటూరు అర్బన్.    45
గుంటూరు రూరల్.    43
ప్రకాశం జిల్లా.           67
నెల్లూరు జిల్లా.          68
కర్నూల్ జిల్లా.           189
కడప జిల్లా.               59
అనంతపూర్ జిల్లా.     73
చిత్తూరు జిల్లా.           20
తిరుపతి.                  16
మొత్తం     711

click me!