బాబుతో పాటు ఆ ఇద్దరిపై కొడాలి ఘాటు వ్యాఖ్యలు: 3 చానెల్స్‌పై చర్యలకు ఆదేశం

By narsimha lodeFirst Published Mar 31, 2020, 10:55 AM IST
Highlights

రేషన్ షాపుల ద్వారా లబ్దిదారులకు రేషన్ అందిస్తామని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని  చెప్పారు. అంతేకాదు  కందిపప్పును కూడ అదనంగా అందిస్తామని ఆయన చెప్పారు. 

అమరావతి:  రేషన్ షాపుల ద్వారా లబ్దిదారులకు రేషన్ అందిస్తామని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని  చెప్పారు. అంతేకాదు  కందిపప్పును కూడ అదనంగా అందిస్తామని ఆయన చెప్పారు. సీఎం జగన్ తో పాటు తనపై విమర్శలు చేసిన టీడీపీ నేతలపై మంత్రి వ్యక్తిగత విమర్శలకు దిగారు. 

ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మంగళవారం నాడు ఉదయం అమరావతిలో మీడియాతో మాట్లాడారు.రేషన్ షాపుల దగ్గర వ్యక్తిగత దూరం పాటించాలని మంత్రి కోరారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అందరికీ రేషన్ అందిస్తామన్నారు.  

రేషన్ కోసం చోడవరం లో వృద్ద మహిళ మృతి చెందిందని ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసిందని మంత్రి నాని ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేసిన చానెల్స్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టుగా మంత్రి చెప్పారు. 

ఎల్లో మీడియాలో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఆధారంగా మాజీ మంత్రులు దేవినేని ఉమ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు ప్రభుత్వంపై తనపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. 

also read:కరోనా నివారణకు రంగంలోకి ప్రత్యేక టీంలు... అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

రేషన్ దుకాణం వద్ద వృద్దురాలు మృతి చెందకముందే ఆమె మృతి చెందినట్టుగా మీడియాలో వచ్చిన వార్తలను చూసి తాను మంత్రి పదవికి రాజీనామా చేయాలని  కోరడం అర్ధరహితమన్నారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు దేవినేని ఉమ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలపై మంత్రి కొడాలి నాని తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు.


చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇబ్బందులను పెడుతుందన్నారు. చంద్రబాబు తన మనుషులతో సీఎం జగన్ పై తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఈ వైరస్ గురించి తెలుసుకొని చంద్రబాబునాయుడు హైద్రాబాద్ లో అద్దాల మేడలో కూర్చొని రాజకీయ విమర్శలకు దిగుతున్నారని మంత్రి కొడాలి నాని చెప్పారు.రాష్ట్ర ప్రజలకు ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని ఆయన చెప్పారు. ఇతర ప్రాంతాల్లో ఉంది ఈ నెలలో రేషన్ తీసుకోలేని వారికి వచ్చే నెలలో రేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని  మంత్రి తెలిపారు.
 

click me!