ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సోమవారం నాడు ఉదయానికి 266కి చేరుకొంది. ఇవాళ కొత్తగా 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరణించిన వారి సంఖ్య మూడుకి చేరుకొంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సోమవారం నాడు ఉదయానికి 266కి చేరుకొంది. ఇవాళ కొత్తగా 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరణించిన వారి సంఖ్య మూడుకి చేరుకొంది.
ఆదివారంనాడు రాత్రికి ఏపీ రాష్ట్రంలో 252 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. రాత్రి నుండి సోమవారం నాడు ఉదయానికి కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 14 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 266కి చేరుకొన్నాయి.
undefined
Also read:కరోనా ఎఫెక్ట్: ఏపీలో ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు జగన్ ఆదేశం
రాష్ట్రంలోని విశాఖపట్టణంలో 5, అనంతపురంలో 3, కర్నూల్ 3, గుంటూరులో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 కొత్త కేసులు నమోదైనట్టుగా సోమవారం నాడు ఉదయం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా సోకిన వారిలో ఐదుగురు రోగులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినట్టుగా అధికారులు తెలిపారు.మరో వైపు కరోనాతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరు మాత్రమే మృతి చెందారు. అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నివేదికలో మరో ఇద్దరు కూడ ఈ వైరస్ తో మృతి చెందినట్టుగా ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో మృతి చెందిన వారి సంఖ్య మూడుకి చేరిందని ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ స్పష్టం చేసింది.
జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు
అనంతపురం-6
చిత్తూరు-17
తూర్పు గోదావరి-11
గుంటూరు-32
కడప-23
కృష్ణా-28
కర్నూల్-58
నెల్లూరు-34
ప్రకాశం-23
విశాఖపట్టణం-20
పశ్చిమ గోదావరి-16
ఇక రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇంతవరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడ నమోదు కాలేదు. కరోనా వైరస్ సోకిన వారిలో ఐదుగురు ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు,ప్రకాశం, విశాఖపట్టణం జిల్లాలనుండి ఒక్కొక్కరి చొప్పున ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయినట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.