నేటి ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం మరో 26 కేసులు నమోదయ్యాయి. ఈ 26 కేసులతో కలుపుకొని 252 కేసులు ఇప్పటివరకు ఏపీలో నమోదయ్యాయి
కరోనా మహమ్మారి విలయతాండవానికి ఇరు తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. మొదట్లో ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అంతలా లేకున్నప్పటికీ... నిజాముద్దీన్ ఘ్తన వల్ల ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి.
నేటి ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం మరో 26 కేసులు నమోదయ్యాయి. ఈ 26 కేసులతో కలుపుకొని 252 కేసులు ఇప్పటివరకు ఏపీలో నమోదయ్యాయి. ఈ 26 కేసులు కూడా ఒక్క కర్నూల్ జిల్లాలోనే నమోదవ్వడం ఆందోళన కలిగిస్తున్న అంశం.
: రాష్ట్రంలో ఈ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నమోదైన కోవిడ్19 పరీక్షల్లో కర్నూల్ లో కొత్త గా 26 కేసు లు నమోదయ్యాయి .కొత్తగా నమోదైన 26 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసు ల సంఖ్య 252 కి పెరిగింది pic.twitter.com/o9YPEYoZCK
— ArogyaAndhra (@ArogyaAndhra)
ఈ రిపోర్టు విడుదలైన తరువాత, ఈ 26 కేసులతో కలుపుకొని కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 53 కేసులు నమోదయ్యాయి. మిగిలిన ఏ జిల్లాలోనూ నేటి ఉదయం నుండి సాయంత్రం వరకు కేసులు పెరగలేదు. కేవలం కర్నూల్ జిల్లాలో మాత్రమే పెరిగాయి.
ఢిల్లీ మర్కజ్ నుండి వచ్చిన వారి నుండి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి జాగ్రత్తలు తీసుకొంటుంది.
శనివారం నాటికి రాష్ట్రంలో 192 కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆ తరువాత 12 గంటల వ్యవధిలో 34 కొత్త కేసులు నమోదు కావడంతో ఈ సంఖ్య నేటి ఉదయానికి 226కి చేరుకుంది. సాయంత్రానికి కర్నూల్ లో 26 కేసులను కలుపుకొని 252 దాటింది.
ఢిల్లీలో ప్రార్ధనలకు కర్నూల్ జిల్లా నుండి సుమారు 200కి పైగా వెళ్లారు. ఢిల్లీకి వెళ్లి వచ్చినవారి శాంపిల్స్ రిపోర్టు వచ్చిన తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏపీ రాష్ట్రంలో పెరిగింది.
జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు
నెల్లూరు- 34
కృష్ణా- 28
కడప- 23
ప్రకాశం-23
గుంటూరు- 30
విశాఖ -15
పశ్చిమగోదావరి -15
తూర్పుగోదావరి -11
చిత్తూరు- 10
కర్నూల్ -53
అనంతపురం -3