మతకల్లోలాలకు కుట్ర, లోకేష్ ఓ లోఫర్: మంత్రి బొత్స సీరియస్

Published : Jan 03, 2021, 01:13 PM IST
మతకల్లోలాలకు కుట్ర, లోకేష్ ఓ లోఫర్: మంత్రి బొత్స సీరియస్

సారాంశం

రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని  ఏపీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.


విజయనగరం: రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని  ఏపీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

ఆదివారం నాడు రామతీర్థంలో విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  రామతీర్థం ఘటన చంద్రబాబు చేయించిందేనని ఆయన చెప్పారు. రామతీర్థం ఘటనపై తాము ఎంతో బాధపడుతున్నామన్నారు. 

రాష్ట్రంలో అధికారం పోయిందనే ఉక్రోశంతో చంద్రబాబు నీచంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

తమ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడ ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

శ్రీరాముడి విగ్రహాన్ని ఇలా చేసినవాడు మనిషేనా? చేయించినవాళ్లు మనుషులేనా ఆయన ప్రశ్నించారు.ఈ నేరం ఎవరు చేసినా శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.

చంద్రబాబు వస్తే ఏంటీ పోతే ఏంటని ఆయన సెటైర్లు వేశారు.  విజయసాయిరెడ్డి రామతీర్ధానికి వస్తే ఆయన కారుపై దాడి చేయించారని బొత్స చెప్పారు.

ఈ ఘటనలతో ఎవరికి ప్రయోజనం కలుగుతోందని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు.కర్నూల్ లో పుకార్లు సృష్టించారన్నారు. 

also read:రామతీర్థం ఘటనలో ప్రమేయం ఉంటే శిక్ష తప్పదు: బాబుకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరిక

మాన్సాస్ స్థలంలో మెడికల్ కాలేజీకి బదులుగా టీడీపీ నేతలకు ఇచ్చుకొన్నారని మంత్రి బొత్స ఆరోపించారు. ట్రస్ట్ ఛైర్మెన్ గా ఉన్న ఆశోక్ గజపతి రాజుకు బాధ్యత లేదా అని ఆయన ప్రశ్నించారు.

లోకేష్ ఓ లోఫర్, ఒక సోమరిపోతు అని మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ ఓ పనికిమాలిన వ్యక్తి అని ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పై ఇష్టారీతిలో విమర్శలు చేయడంపై ఆయన మండిపడ్డారు.

PREV
click me!

Recommended Stories

మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్.. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి రూ.41.50లక్షల సాయం...
కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు చేతికర్ర: టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి