విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు నిర్ణయం తీసుకొంది. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయనపై వేటేసింది సర్కార్.
విశాఖపట్టణం:విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు నిర్ణయం తీసుకొంది. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయనపై వేటేసింది సర్కార్.
నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో సుధాకర్ ఎనస్థీషీయన్ గా పనిచేస్తున్నారు. విపత్కర సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందును ఆయనపై చర్యలు తీసుకొన్నారు.
undefined
ఎన్-95 మాస్కులు అందుబాటులో లేవని సుధాకర్ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ డాక్టర్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని ఏపీ రాష్ట్రంలో డాక్టర్లకు సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన ఆరోపించారు.
తన మాటల ద్వారా ప్రజలను డాక్టర్ సుధాకర్ భయబ్రాంతులకు గురి చేశాడని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. డాక్టర్ సుధాకర్ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. తగినన్ని మాస్కులు, ప్రొటెక్షన్ కిట్స్ లేకుండా కరోనా రోగులకు ఎలా వైద్యం చేస్తామని డాక్టర్ సుధాకర్ ప్రశ్నించాడు.
సోమవారం నాడు మున్సిపల్ కార్యాలయంలో అధికారుల సమీక్ష సమావేశానికి హాజరైన సమయంలో డాక్టర్ సుధాకర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
మంగళవారం నాడు నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి వివిధ శాఖల అధికారులు విచారణ జరిపించారు.
ఈ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు,నర్సులు, పారిశుద్య సిబ్బందికి అవసరమైన ఎన్-95 మాస్కులు, ప్రొటెక్షన్ కిట్స్ ఉన్నాయని అధికారులు కలెక్టర్ కు నివేదిక సమర్పించారు.
కలెక్టర్ ఇచ్చిన నివేదిక మేరకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ అధికారులు బుధవారం నాడు డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ సుధాకర్ పై నర్నీపట్నంలో కేసు కూడ నమోదైంది. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే విధంగా డాక్టర్ సుధాకర్ మాట్లాడినందుకు కేసు నమోదైంది.