రాష్ట్రంలో ఇవాళ్టికి 87 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా ఏపీ సీం వైఎస్ జగన్ చెప్పారు. ఈ కేసుల్లో ఎక్కువగా ఢిల్లీ నుండి వెళ్లి వచ్చిన వారితో పాటు వారితో సన్నిహితంగా ఉన్నవారు 70 మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి: రాష్ట్రంలో ఇవాళ్టికి 87 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా ఏపీ సీం వైఎస్ జగన్ చెప్పారు. ఈ కేసుల్లో ఎక్కువగా ఢిల్లీ నుండి వెళ్లి వచ్చిన వారితో పాటు వారితో సన్నిహితంగా ఉన్నవారు 70 మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం నాడు సాయంత్రం ఏపీ సీఎం వైఎస్ జగన్ అమరావతిలో మీడియాతో మాట్లాడారు.ఢిల్లీకి వెళ్లి వచ్చిన ప్రతి ఒక్కరిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టుగా సీఎం చెప్పారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వారిని కూడ గుర్తించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకొన్నారన్నారు.
Also read:ఏపీలో విజృంభిస్తున్న కరోనా: 12 గంటల్లో 43 కొత్త కేసులు, 87కి చేరిన మొత్తం కేసులు
రాష్ట్రం నుండి ఢిల్లిలో జరిగిన మత ప్రార్థనలకు 1085 మంది హాజరైనట్టుగా సీఎం ప్రకటించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో ఇంకా 21 మందిని గుర్తించాల్సి ఉందని సీఎం చెప్పారు..
కరోనా గురించి ఎవరూ కూడ భయపడకూడదన్నారు. రెండు రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని సీఎం చెప్పారు. ఢిల్లికి వెళ్లి వచ్చిన వారికి కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని ఆయన అభిప్రాయపడ్డారు.చాలా మంది చికిత్స తర్వాత ఈ వ్యాధి నయమై ఇంటికి వెళ్లిపోయిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు.
కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడం బాధకల్గిస్తోందని సీఎం చెప్పారు. ప్రజలు ఎవరూ కూడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగన్ చెప్పారు. కరోనా సులువుగా వ్యాపించే వైరస్ మాత్రమేనన్నారు. వయస్సు మళ్లిన వారు ఈ వైరస్ సోకకుండా జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు.