కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైళ్లలో ఉన్న 259 మందిని మధ్యంతర బెయిల్ పై విడుదల చేశారు. విడుదలైన వారంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో లేదా తమ స్వంత ఇంట్లోని క్వారంటైన్ లో ఉండాలని అధికారులు ఆదేశించారు.
అమరావతి: కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైళ్లలో ఉన్న 259 మందిని మధ్యంతర బెయిల్ పై విడుదల చేశారు. విడుదలైన వారంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో లేదా తమ స్వంత ఇంట్లోని క్వారంటైన్ లో ఉండాలని అధికారులు ఆదేశించారు.
రాష్ట్రంలోని 81 జైళ్లలో 6930 మంది ఖైదీలున్నారు. జైళ్లలో ఖైదీలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టింది రాష్ట్ర జైళ్ల శాఖ. జైలు బ్యారక్ లలో తక్కువ మందిని ఉంచుతున్నారు. భోజన సమయంలో పది మంది చొప్పున అనుమతించారు. బ్యారక్ లోపల, జైలు ఆవరణలో ఖైదీలు భౌతిక దూరం పాటించేలా చూస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ఖైదీలకు అవసరమైన మాస్కులను జైళ్లలోనే తయారు చేస్తున్నారు. విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, నెల్లూరు, కడప సెంట్రల్ జైళ్లలో ఈ మాస్కులను ఖైదీలతో చేయిస్తున్నారు. అదే విధంగా విజయవాడ, ఒంగోలు జిల్లా జైళ్లలో కూడ మాస్కుల తయారీ చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటి సిఫారసులతో ఏడేళ్లలోపు జైలు శిక్ష పడిన వారిని మధ్యంతర బెయిల్ పై విడుదల చేశారు. మిగిలిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నట్టుగా జైలు అధికారులు ప్రకటించారు.
Also read:వలస కార్మికులు ఆకలితో బాధపడొద్దని సీఎం ఆదేశం: డిప్యూటీ సీఎం ఆళ్ల నాని
ఏపీ రాష్ట్రంలో శుక్రవారం నాటికి 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఎక్కువగా ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలో ప్రార్థనలు చేసిన వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. ఢిల్లీ నుండి వచ్చిన వారితో పాటు వారి కుటుంబసభ్యులు 140 మందికి కరోనా సోకింది