ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు కొత్త టెక్నాలజీ....

By Sandra Ashok KumarFirst Published Feb 3, 2020, 1:48 PM IST
Highlights

కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం విద్యుత్ వాహనాల తయారీపై యావత్ ఆటోమొబైల్ రంగం కసరత్తు చేస్తోంది. విద్యుత్ నిల్వకు వాడుకునే బ్యాటరీ తయారీపైనే ఎక్కువ భారం పడుతోంది. విద్యుత్ కారు ధరలో బ్యాటరీ ధర 25-30 శాతంగా ఉంటున్నది. ఈ క్రమంలో బ్యాటరీ కార్లను అత్యంత చౌకగా తయారు చేసేందుకు వీ2ఎక్స్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) అసోసియేట్ ప్రొఫెసర్ హితేశ్ దత్ మాథూర్. తదనుగుణంగా మరో రెండు సొల్యూషన్స్ కోసం ఆ సంస్థ పరిశోధక విద్యార్థులు అధ్యయనం సాగిస్తున్నారు. 
 

కోట: రెండు ఎలక్ట్రిక్ వెహికల్ సొల్యూసన్స్ రూపకల్పనపై రీసెర్చ్ విద్యార్థులు ద్రుష్టిని కేంద్రీకరించి అధ్యయనం చేస్తున్నారు. విద్యుత్ వాహనాల ధర దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మరో ఎలక్ట్రిక్ వెహికల్‌లోని స్టోర్డ్ బ్యాటరీ పవర్ షేర్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించే టెక్నాలజీ, సెల్ ఎక్సెస్ ఎనర్జీ టూ మేక్ ఏ ఫాస్ట్ బక్ కోసం పరిశోధనలు జరుగుతున్నాయని బిట్స్ పిలానీ ప్రొఫెసర్ ఒకరు చెప్పారు.  

వీటితోపాటు పవర్ షేరింగ్ టూల్ వెహికల్ టు ఎవ్రీథింగ్ (వీ2ఎక్స్) కోసం పరిశోధక విద్యార్థులు రీసెర్చ్ చేస్తున్నారు. గ్యాస్ రీఫిల్లింగ్ మాదిరిగానే బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలపైనా విద్యార్థుల అధ్యయనం సాగుతుందని పిలానీలోని బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) అసోసియేట్ ప్రొఫెసర్ హితేశ్ దత్ మాథూర్ పేర్కొన్నారు. 

also read హ్యుండాయ్ మోటర్స్ నుండి కొత్త మోడల్ స్పోర్ట్స్ కారు....

ఈ రెండు సొల్యూషన్లు విజయవంతమైతే విద్యుత్ వాహనాల కొనుగోలు కోసం భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండదు. ప్రస్తుతం విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయడంలో బ్యాటరీల ధర 25 నుంచి 30 శాతం ఉంటుంది. ఈ సొల్యూషన్స్ కోసం కేంద్ర మానవ వనరుల అభివ్రుద్ధిశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిధులు సమకూరుస్తున్నాయి. 

ఇతర విద్యుత్ వాహనంలో ఉన్న పవర్ షేరింగ్, గ్రిడ్, హోటల్, మాల్స్ వద్ద షేరింగ్ కోసం విద్యుత్ వాహనంలో వాడకానికి వీలుగా వీ2ఎక్స్ టెక్నాలజీని బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) అసోసియేట్ ప్రొఫెసర్ హితేశ్ దత్ మాథూర్ డెవలప్ చేశారు. 

వీ2 టెక్నాలజీతో రూపుదిద్దుకున్న విద్యుత్ చార్జింగ్ కోసం యూనిట్ కు రూ.8 మాత్రమే ఖర్చవుతుంది. ప్రస్తుతం దేశీయంగా యూనిట్ పై రూ.15 వసూలు చేస్తున్నారని బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) అసోసియేట్ ప్రొఫెసర్ హితేశ్ దత్ మాథూర్ చెప్పారు. విద్యుత్ వాహనం వినియోగంలో లేకపోతే గ్రిడ్ తోపాటు ఇతర వాహనాలకు అమ్ముకోవచ్చునని తెలిపారు. ఉదాహరణకు 20 యూనిట్లు విక్రయిస్తే రూ.140 పొందొచ్చు. 

వీ2ఎక్స్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న విద్యుత్ వాహనాలు ఒకరోజు షాపింగ్ మాల్‌లో కొన్ని గంటల పాటు పార్కింగ్ చేసి ఉంటే అక్కడ ఐదు నుంచి 10 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఉన్నట్లే. ఒక్కో కారు బ్యాటరీలో 20-25 కిలోవాట్ల విద్యుత్ నిల్వ ఉంటుంది. ఒకవేళ 30-40 శాతం కస్టమర్లు గ్రిడ్ కు తమ కార్లలో నిల్వ ఉన్న విద్యుత్ విక్రయించినా బాగానే ఉంటుంది. దీన్ని మొబైల్ యాప్ ద్వారా చేసేయవచ్చు అని బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) అసోసియేట్ ప్రొఫెసర్ హితేశ్ దత్ మాథూర్ తెలిపారు. 

also read 

అయితే, వీ2ఎక్స్ టెక్నాలజీని కమర్షియల్, నాన్ కమర్షియల్ వేదికల వద్ద వినియోగించడానికి అవసరమైన మౌలిక వసతుల సమస్యను అధిగమించాల్సి ఉందన్నారు. బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు డెవలప్ చేయడం మరో అంశం అని తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే 25-30 శాతం విద్యుత్ వాహనం తగ్గుముఖం పడుతుందన్నారు. 

బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను భారీ స్థాయిలో ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం తప్పనిసరి.  పెట్రోల్ పంపుల మాదిరిగానే భవిష్యత్‌లో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉందని బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) అసోసియేట్ ప్రొఫెసర్ హితేశ్ దత్ మాథూర్ చెప్పారు. పవన విద్యుత్, సౌర విద్యుత్ మాదిరిగా బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు కూడా సొంతంగా సంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక వనరులను కలిగి ఉండాలని చెబుతున్నారు. 
 

click me!