ఏం చేసినా.. ఎలా చేసినా విద్యుత్ వాహనాలకు చైనా దిగుమతులే దిక్కు

By Siva KodatiFirst Published Mar 18, 2019, 10:44 AM IST
Highlights

బయటకు భావోద్వేగాలు రగల్చడానికి చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిస్తారు. కానీ ఆచరణలో మన ఉత్పత్తుల కంటే మెరుగ్గా చైనా ఉత్పత్తులు ఉంటాయని చెబుతున్నారు.

ఈ మధ్య చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని దేశీయంగా అక్కడక్కడ నిరసన ప్రదర్శనలు జరిగాయి. వాటిల్లో వ్యాపార వేత్తలు కూడా పాల్గొన్నారు. కానీ అదే వ్యాపార వేత్తలు చైనా నుంచి వస్తువులు, కార్లు, ద్విచక్ర వాహనాల విడి భాగాలను దిగుమతి చేసుకుంటున్నారన్నది వాస్తవం.

ప్రపంచంలోకెల్లా మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ ముంబై. కానీ మున్ముందు ఆటోమొబైల్ పరిశ్రమ అంతా విద్యుత్ వాహనాల మయం కాక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. అయితే విద్యుత్ వాహనాల నిర్మాణానికి అవసరమైన విడి భాగాల కోసం చైనాపై ఆధారపడే పరిస్థితి రోజురోజుకు పెరుగుతోంది.

కేవలం 2018 ఆర్థిక సంవత్సరంలోనే భారతదేశానికి చైనా దిగుమతులు 4.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది 2013 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 27 శాతం ఎక్కువ. మున్ముందు చైనా నుంచి విడి భాగాల దిగుమతులు పెరుగుతాయే తప్ప, తగ్గే సంకేతాల్లేవని ఆటోమొబైల్ పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయ పడుతున్నారు.

భారత్ నుంచి ఎగుమతుల కంటే చైనా నుంచి దిగుమతులే 10 రెట్లు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. అందులో ఆటోమొబైల్ విడి భాగాలే ఎక్కువ. పదేపదే ఆటోమొబైల్ విడి భాగాలను దిగుమతి చేసుకోవడంతో భారత్ ఆటోమొబైల్ పరిశ్రమకు పెనుముప్పుగా పరిణమిస్తుందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.

దీనివల్ల భారత్ వాణిజ్య లోటు పెరిగి విపరిణామాలకు దారి తీస్తుందని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. మున్ముందు నూతన విద్యుత్ వాహనాల కోసం భారత్ చైనా ఎగుమతులపైనే మరింత ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

తాజాగా భారతదేశంలో పలు విద్యుత్ వాహనాలు మార్కెట్లో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి. వాటిల్లో ఎలక్ట్రానిక్ విడి భాగాల కోసం చైనాపై ఆధారపడి ఉన్నాం కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో చైనా ఎగుమతుల్లో ఎలక్ట్రానిక్ వస్తువులే ఎక్కువగా ఉంటాయని అంచనా. 

భారత్‌లో నాన్ ఎగ్జిస్టెంట్ హార్డ్ వేర్ బేస్ ఉన్నా, ఆచరణలో ఓఈఎంలు, టైర్ -1 సప్లయర్లు చైనా దిగుమతులపైనే ఆధారపడి ఉంటున్నారు. ఎలక్ట్రికల్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ కాంపొనెంట్స్, డ్రైవ్ ట్రాన్సిమిషన్ పరికరాలన్నీ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. 

భారతదేశంలో వాహనాల విద్యుద్ధీకరణకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసేసింది. కనుక ఆ లక్ష్యాల సాధన కోసం తీవ్రంగా ప్రయత్నిస్తే మాత్రం వాహనాల కాంపొనెంట్స్, సబ్ కాంపొనెంట్స్ దిగుమతులు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. 

స్థానికత టార్గెట్లు ఉన్నా, ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తున్నా భారతదేశంలో వాటికంటే చైనా ఉత్పత్తులే ఎక్కువ పోటీతత్వాన్ని కనబరుస్తున్నాయి. ఈ నాటికి డీసీ మోటార్స్ వంటి సంస్థల నుంచి కొన్ని పరికరాలను దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని ఫ్రోస్ట్ అండ్ సుల్లివాన్ మొబిలిటీ ప్రోగ్రాం మేనేజర్ అశ్వినీ కుమార్ తెలిపారు. 

మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ హేమంత్ సిక్కా మాట్లాడుతూ భారతదేశంలో ఇప్పటివరకు ఎస్టాబ్లిష్డ్ విద్యుత్ వాహనాల తయారీ వ్యవస్థ లేనే లేదన్నారు. విద్యుతేతర వాహన విడి భాగాలను వ్యూహాత్మక కారణాలు, కాస్ట్ బెనిఫిట్స్ తదితర అంశాల వల్ల దిగుమతి చేసుకోవాల్సి వస్తుందన్నారు. 

click me!