
ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా నవంబర్‌లో ఇండియాలో 1,759,000 బ్యాడ్ అకౌంట్లను తొలగించినట్లు వాట్సాప్ ప్రకటించింది. నవంబర్ నెలలో 602 ఫిర్యాదులు వచ్చాయని అందులో 36 అకౌంట్లపై చర్యలు తీసుకున్నామని తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్‌లలో దుర్వినియోగాన్ని నిరోధించడంలో వాట్సాప్ ముందంజలో ఉందని తెలిపింది. తమ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగిస్తున్న వినయోగదారులను సురక్షితంగా ఉంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఇతర అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని చెప్పింది. డేటా సైంటిస్టులు, టెక్నీషియన్లు ఈ పనిలోనే ఉన్నారని పేర్కొంది.
27వేలకు పైగా కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న ఒమిక్రాన్ వ్యాప్తి.. కొత్తగా ఎన్నంటే?
ఇండియాలో అక్టోబర్ నెలలో వాట్సాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 20 లక్షలకు పైగా అకౌంట్లను తొలగించిందని ఆ సంస్థ తెలిపింది. ఆ నెల వరకు 500 ఫిర్యాదులు అందాయని చెప్పింది. వాట్సాప్‌కు ఇండియాలో 40 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారని చెప్పింది. ఇండియాలో మే నెలలో కొత్త ఐటీ రూల్స్ అమలులోకి వచ్చాయి. దీని 50 లక్షల మంది వినియోగిస్తున్న ప్రతీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ తమ నెల వారీ ఫిర్యాదులు, తీసుకున్న చర్యలు ప్రచురించాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం వాట్సాప్ కూడా వివరాలు వెల్లడించింది.
మెసెంజింగ్ సర్వీస్ యాప్ లలో వాట్సాప్ రాక సంచలనం. మెసెంజింగ్ సర్వీస్ లలో ఇది విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. నేడు వాట్సప్ ఉపయోగించని స్మార్ట్ ఫోన్ యూజర్ లేరంటే నమ్మకుండా ఉండలేం. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు దీనిని ఉపయోగిస్తూనే ఉంటాం. ఈ వాట్సప్ ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతోంది. ఈ వాట్సప్ రావడం వల్ల కమ్యూనికేషన్ చాలా సులభం అయిపోయింది. వాట్సప్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ వస్తున్నారు. దీనిని 2009 సంవత్సరంలో రూపొందించినప్పటికీ 2011లో ఇది పాపులర్ అయ్యింది.
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఒక్కరోజులో 6 వేల NGOsల విదేశీ విరాళాలు కట్!
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వాట్సప్‌కు 2 బిలియన్ యాక్టివ్ యూసర్స్ ఉన్నారు. ఇప్పటికప్పుడు దీనిని అప్‌డేట్ చేస్తూ ఉండటం వల్ల ప్రతీ ఏటా దీనికి కొత్త వినియోగదారులు పెరుగుతున్నారు. కొత్త కొత్త మెసెంజింగ్ యాప్స్ ఎన్ని వస్తున్నా.. చాలా మంది యూజర్లు వేరే యాప్‌కు వెళ్లిపోకుండా వాట్సాప్ నే వాడుతున్నారు. ఈ వాట్సప్ ద్వారా మెసెజెస్, వాయిస్ మెసెజెస్ షేర్ చేసుకోవడంతో పాటు వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్స్ పంపించుకోవచ్చనే విషయం అందరికే తెలిసిందే. 2016 నవంబర్ నెల నుంచి ఇందులో వీడియో కాల్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. దీంతో స్కైప్ వంటి యాప్‌లు వాడకుండా చాలా మంది ఈ వాట్సప్ ద్వారానే వీడియో కాల్ చేసుకుంటున్నారు. త్వరలోనే గ్రూప్ అడ్మిన్‌లకు ఆయా సభ్యులు చేసే పోస్టులను డిలీట్ చేసేందుకు కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుందని వాట్సాప్ ప్రకటించింది. ప్రస్తుతం ఇది కొందరు బెటా వర్షన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంచామని తెలిపింది. ఇది త్వరలోనే అందరు వాట్సాప్ యూజర్ లకు అందుబాటులోకి తీసుకొస్తామని వాట్పాప్ ప్రకటించింది.