Edible Oil Prices: సామాన్యులకు బిగ్ రిలీఫ్.. వంట నూనెల ధరలను భారీగా తగ్గించిన కంపెనీలు.. వివరాలు ఇవే..

By Sumanth KanukulaFirst Published Dec 31, 2021, 10:48 AM IST
Highlights

ఎడిబుల్ ఆయిల్ కంపెనీలు (edible oil companies) సామాన్యులకు తీపి కబురు అందిచాయి. వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా.. అదానీ విల్‌‌‌‌మర్‌‌‌‌‌‌‌‌, రుచి సోయా సహా ప్రధాన ఎడిబుల్ ఆయిల్ కంపెనీలు ధరలను భారీగా తగ్గించినట్టుగా ఆహార, ప్రజాపంపిణీ శాఖ (Food and Public Distribution) కార్యదర్శి సుధాంశు పాండే తెలిపారు. 
 

గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది ప్రజలు వంట నూనెలను పొదుపుగా వాడుతున్నారు. వంట నూనెల ధరల (edible oil prices) తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సామాన్యులకు తీపి కబురు అందింది. వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా.. అదానీ విల్‌‌‌‌మర్‌‌‌‌‌‌‌‌, రుచి సోయా సహా ప్రధాన ఎడిబుల్ ఆయిల్ కంపెనీలు ధరలు తగ్గించేందుకు ముందుకు వచ్చాయి. పలు ప్రధాన కంపెనీలు తమ ఉత్పత్తులపై ఎంఆర్‌పీని 15 నుంచి 20 శాతం తగ్గించాయని ఆహార, ప్రజాపంపిణీ శాఖ (Food and Public Distribution) కార్యదర్శి సుధాంశు పాండే తెలిపారు. 

‘వంట నూనెల ధరలు కొంతకాలంగా ఆందోళన కలిగిస్తుంది. అయిల్ పరిశ్రమతో సమావేశాలు నిర్వహించి.. చాలా చురుకైన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే వంట నూనెల ధరల్లో గణనీయమైన తగ్గింపు జరింది. పెద్ద బ్రాండ్‌లు అన్నీ నిన్ననే ఎడిబుల్ ఆయిల్స్ ధరల్లో భారీగా తగ్గింపు చేపట్టాయి. రుచి సోయా ఇండస్ట్రీస్ వివిధ నూనెలపై రిటైల్ ధరలను లీటరుకు రూ. 14 నుంచి 30 వరకు, బంగే ఇండియా ధరలను రూ. 10 నుంచి రూ. 20 పరిధిలో, ఫార్చ్యూన్ బ్రాండ్‌ ఆయిల్స్‌ను విక్రయించే అదానీ విల్మార్  రూ. 40 వరకు ధరలు తగ్గించాయి. కొత్త MRPని స్టాక్ మార్కెట్‌లో ఇచ్చారు. ఇప్పుడు తగ్గించిన ధరలతోనే సరఫరా జరుగుతుంది. కొత్త MRP అందుబాటులో ఉంది. ఇది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది’ అని సుధాంశు పాండే వర్చువల్ కాన్ఫరెన్స్ సందర్భంగా చెప్పారు. 

Also Read: కేంద్రం దిద్దుబాటు చర్యలు.. సామాన్యుడికి ఊరట.. దిగొస్తున్న వంట నూనెల ధరలు

‘60 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడి ఉన్నప్పుడు.. సహజంగానే దేశీయ ధరలు అంతర్జాతీయ ధరలచే ప్రభావితమవుతాయి. వంట నూనెల విషయంలో సుంకాన్ని కేంద్రం దాదాపు సున్నాకి తగగ్ించింది. దీంతో ఆయిల్ బ్రాండ్ల ధరలలో గణనీయమైన తగ్గింపు చోటుచేసుకుంది. వంట నూనెల తగ్గడం ఇటీవలి కాలంలో ఇది రెండో సారి. ఇంతకు ముందు కూడా వంట నూనెల ధరలలో 8 నుంచి 10 శాతం వరకు తగ్గింపు జరిగింది’ అని సుధాంశు పాండే తెలిపారు. 
 

click me!