
డిసెంబర్ 31 సంవత్సరంలో చివరి రోజు మాత్రమే కాదు శుక్రవారం కావడంతో వారం ప్రకారం చివరి బిజినెస్ డే కూడా. ఈరోజు బంగారం(gold), వెండి (silver)ధరలు ఫ్లాట్ నోట్‌లో ట్రేడవుతున్నాయి. భారత ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. కాగా వెండి ధర కూడా రూ.100 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్(international market)లో బంగారం, వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి.
భారతదేశంలో బంగారం ధరలో స్వల్ప పెరుగుదల
భారతదేశ ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధర స్వల్ప పెరుగుదలతో నమోదైంది. మల్టీ కమోడిటీ ఇండెక్స్‌లో బంగారం ధరలు ఉదయం 9:40 గంటలకు 10 గ్రాములకు రూ.29 పెరిగి రూ.47914 వద్ద ట్రేడవుతున్నాయి. కాగా, ఈరోజు బంగారం పది గ్రాములకు రూ.47946 వద్ద ప్రారంభమైంది. అంతకు ముందు రోజు బంగారం పది గ్రాములకు రూ.47885తో ముగిసింది.
వెండి ధరలో పెరుగుదల
వెండి ధర గురించి మాట్లాడితే మల్టీ కమోడిటీ ఇండెక్స్‌లో ఉదయం 9:40 గంటలకు వెండి ధర కిలోకు రూ.110 పెరిగి రూ.62270 వద్ద ట్రేడవుతోంది. కాగా, నేడు కిలో వెండి ధర రూ.62400 వద్ద ప్రారంభమైంది. ఇది కూడా నేటి అధిక స్థాయి. ఒక రోజు ముందు వెండి కిలో ధర రూ.62160 వద్ద ముగిసింది. 2021లో వెండి దాదాపు 9 శాతం క్షీణతతో ట్రేడవుతుంది.
న్యూయార్క్‌లోని కోమెక్స్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 4.40 డాలర్ల లాభంతో 1818.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గోల్డ్ స్పాట్ ఔన్సుకు 3.37 డాలర్ల లాభంతో 1818.04 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి గురించి మాట్లాడినట్లయితే, న్యూయార్క్ కామేక్స్ మార్కెట్ 0.37 శాతం పెరిగి ఔన్స్ 23.15 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ఔన్స్‌కు 0.28 శాతం పెరిగి 23.11 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
also read న్యూ ఇయర్ జనవరి 1నే ఎందుకు జరుపుకుంటారు, దీని చరిత్ర ఏమిటో తెలుసా..?
ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,020గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,120గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,760గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,760గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,320గా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,750గా ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,990గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,990గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990గా ఉంది.
ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.65,500 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65,500గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 61,600గా ఉంది.
ఈ ధరలు 31-12-2021 శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలను సమీక్షించుకుంటూ బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.