ఆన్‌లైన్‌లో టాటా నుండి స్పెషల్ లగ్జరీ కాఫీ...

By Sandra Ashok Kumar  |  First Published Mar 5, 2020, 1:11 PM IST

'ది సొనెట్స్-ది వాయిస్ ఆఫ్ అవర్ ఎస్టేట్స్' అనే మూడు రకాల లగ్జరీ సింగిల్ ఆరిజన్ స్పెషాలిటీ కాఫీ  పేరుతో వెబ్‌సైట్ ప్రారంభమైంది.
 


బెంగళూరు: టాటా కాఫీ లిమిటెడ్ నుబంధ సంస్థ అయిన టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్  తన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ "www.coffeesonnets.com" ను ప్రారంభించినట్లు బుధవారం ప్రకటించింది.

'ది సొనెట్స్-ది వాయిస్ ఆఫ్ అవర్ ఎస్టేట్స్' అనే మూడు రకాల లగ్జరీ సింగిల్ ఆరిజన్ స్పెషాలిటీ కాఫీ  పేరుతో ఈ వెబ్‌సైట్ ప్రారంభమైంది.

Latest Videos

undefined

also read ఫ్లిప్‌కార్ట్‌ కో ఫౌండర్‌ సచిన్ బన్సాల్‌పై వరకట్న వేధింపుల కేసు

ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా అత్యుత్తమమైన టాటా కాఫీలను భారతదేశం అంతటా కాఫీ ప్రియులకు అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది అని ఒక ప్రకటనలో టాటా కంపెనీ తెలిపింది.

 ఈ సింగిల్ ఎస్టేట్ కాఫీ గింజలను చాలా జాగ్రత్తగా ప్రాసెస్ చేయబడతాయి. అలాగే ఈ సీజన్‌లో పండించిన ఉత్తమమైన కాఫీ గింజలను  మాత్రమే జాగ్రత్తగా ఎంపిక చేసి ది సొనెట్స్ కాఫీలలో ఉపయోగిస్తారు అని టిసిఎల్ తెలిపింది.

also read ఆన్ లైన్‌ చెల్లింపులలో కొత్త టెక్నాలజి...వేలి ఉంగరంతోనూ పేమెంట్స్....

కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతంలో ఉన్న రెండు  టాటా కాఫీ ఎస్టేట్లలో నుండి కాఫీ గింజలు నేరుగా లభిస్తాయి.గూర్ఘులీ, వోషుల్లిలోని ఈ ఎస్టేట్లు దేశంలోని కొన్ని ఉత్తమ అరబికా కాఫీలను పెంచినందుకు గుర్తింపు పొందాయని కంపెనీ తెలిపింది.

టిసిఎల్ ఎండి,  సిఇఒ చాకో థామస్ మాట్లాడుతూ ది సొనెట్స్-ది వాయిస్ ఆఫ్ మా ఎస్టేట్స్ దేశవ్యాప్తంగా కాఫీ ప్రియులకు మా ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా మా అత్యుత్తమ ఎస్టేట్స్ కాఫీలకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది అని అన్నారు.

click me!