మార్చి 27న మళ్ళీ బ్యాంకు యూనియన్ల సమ్మె...

By Sandra Ashok Kumar  |  First Published Mar 5, 2020, 12:14 PM IST

మొండి బకాయిలు, లోన్ల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి వెంకటచలం అన్నారు. 


కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించిన బ్యాంక్ విలీనాలను వ్యతిరేకిస్తూ బ్యాంకింగ్ రంగంలోని రెండు ప్రధాన యూనియన్లు - ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA) మార్చి 27 న సమ్మెకు దిగనున్నాయి. 

మొండి బకాయిలు, లోన్ల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి వెంకటచలం అన్నారు. మొండి రుణాల మొత్తం రూ. 216,000 కోట్లుగా వుండటంతో  2019 మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం రూ .150,000 కోట్ల స్థూల లాభాలకు పరిమితమైనాయని ఆయన అన్నారు.

Latest Videos

undefined

also read ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్: 2020-21లో ఉద్యోగుల వేతనాల పెంపు...

దీంతో రూ .66,000 కోట్ల నికర నష్టం వాటిల్లిందని కూడా విమర్శించారు. తాజాగా బ్యాంకుల విలీనం వల్ల భారీ  ఎత్తున పేరుకు పోయిన కార్పొరేట్  మొండి బకాయిల లోన్లు తిరిగి వస్తాయని ఎలా నమ్మగలమని ఆయన ప్రశ్నించారు.

దీనికి  ఉదాహరణగా ఎస్‌బీఐ విలీనం తరువాత ఈ  బెడద మరింత పెరిగిందనే విషయాన్ని గుర్తుచేశారు.  కేవలం 323 మిలియన్ల జనాభా ఉన్న అమెరికాలో బ్యాంకుల సంఖ్య భారతదేశంలోని బ్యాంకుల కంటేఎక్కువ ఉందని, అలాంటిది 1.35 బిలియన్ల జనాభా కలిగిన భారతదేశంలో మరిన్ని బ్యాంకుల అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల  ఏకీకరణ అవసరం లేదని వెంకటాచలం అభిప్రాయం వ్యక్తం చేశారు.

also read కరోనా ఎఫెక్ట్: పెరసిటామాల్ పాటు మరో 25 ఇతర మందులపై బ్యాన్...

ఎస్‌బిఐలో గత సంవత్సరం బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనం తరువాత, ప్రభుత్వం 10 బ్యాంకుల విలీనాన్ని ప్రకటించింది, అంటే ఆంధ్ర బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, సిండికేట్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూసివేయాల్సి వస్తుందని అతను చెప్పాడు.

click me!