స్విగ్గీ ఇన్స్టామార్ట్ మాక్స్సేవర్ ఫీచర్ తెచ్చింది. దీని ద్వారా రూ.999 పైన కొంటే వెంటనే డిస్కౌంట్ వస్తుంది. జెప్టోతో పోటీ, BLCK మెంబర్లకు లాభం, ఇండస్ట్రీ ట్రెండ్స్ తెలుసుకోండి.
Swiggy Instamart MaxxSaver: స్విగ్గీ తన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇన్స్టామార్ట్‌లో ‘MaxxSaver’ అనే కొత్త ఫీచర్ లాంచ్ చేసింది. దీని ద్వారా రూ.999 కంటే ఎక్కువ కొంటే యూజర్లకు భారీ డిస్కౌంట్ వస్తుంది. ఈ ఫీచర్ దేశవ్యాప్తంగా స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఉన్న 100 నగరాల్లో అందుబాటులోకి తెస్తున్నారు. స్విగ్గీ 10 నిమిషాల్లో డెలివరీ గ్యారెంటీ ఈ ఫీచర్‌తో కూడా ఉంటుంది.
ఇన్స్టామార్ట్ సీఈఓ అమితేష్ ఝా మాట్లాడుతూ.. మాక్స్సేవర్ ద్వారా స్విగ్గీ ఇన్స్టామార్ట్‌ను దేశంలోనే చౌకైన, సులభమైన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా చేయాలనుకుంటున్నాం అన్నారు. పెద్ద ఆర్డర్ల ద్వారా యూజర్లకు మంచి విలువను అందించగలుగుతున్నామన్నారు. Swiggy BLCK మెంబర్లకు ఈ ఫీచర్ కింద అదనపు ప్రయోజనాలు ఉంటాయని కూడా ఆయన చెప్పారు.
స్విగ్గీ మాక్స్‌సేవర్ ఫీచర్ గత సంవత్సరం జెప్టో ప్రారంభించిన ‘SuperSaver’ నుంచి ప్రేరణ పొందినట్లుగా ఉంది. తేడా ఏంటంటే జెప్టో ఫీచర్ యూజర్ ఆప్ట్-ఇన్ ఆధారితం కాగా, మాక్స్‌సేవర్ ఆటోమేటిక్‌గా వర్తిస్తుంది. కార్ట్ విలువ రూ.999 దాటితే చాలు.
మాక్స్‌సేవర్ లాంచింగ్ ఎప్పుడు జరిగిందంటే.. జెప్టో తన పాత జెప్టో పాస్ సబ్‌స్క్రిప్షన్‌ను మూసివేసి ‘Zepto Daily’ అనే ఇన్వైట్-ఓన్లీ సేవను ప్రారంభిస్తోంది.
స్విగ్గీ లెక్కల ప్రకారం FY2025 మూడో త్రైమాసికంలో వారి క్విక్ కామర్స్ ఆర్డర్ల సగటు విలువ 14% పెరిగి ₹469 నుంచి ₹534కి చేరింది. అంటే కస్టమర్లు ఇప్పుడు ఒకేసారి ఎక్కువ వస్తువులు ఆర్డర్ చేస్తున్నారు. ఈ ట్రెండ్‌ను చూసి స్విగ్గీ, జెప్టో, బ్లింకిట్ ఇంకా ఇతర క్విక్ కామర్స్ కంపెనీలు తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను కేవలం గ్రాసరీకి మాత్రమే పరిమితం చేయకుండా ఫ్యాషన్, బ్యూటీ, ఎలక్ట్రానిక్స్, ట్రావెల్, హోమ్ డెకర్ వంటి కేటగిరీలు కూడా కలుపుతున్నాయి.
Flipkart Minutes త్వరలో 500-550 డార్క్ స్టోర్లతో బిగ్ బిలియన్ డేస్ సేల్ ముందు పెద్ద ఎత్తున విస్తరించనుంది. Amazon Now కూడా బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో తన సేవను పరీక్షిస్తోంది.