Black Water: విరాట్ కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ ఎంత ఖరీదైందో తెలుసా? మెడిసిన్‌లోనూ ఈ నీరు వాడతారు

Published : Mar 08, 2025, 02:45 PM IST
Black Water: విరాట్ కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ ఎంత ఖరీదైందో తెలుసా? మెడిసిన్‌లోనూ ఈ నీరు వాడతారు

సారాంశం

Black Water Benefits : సెలబ్రిటీలు తాగడం వల్ల ఫేమస్ అయిన బ్లాక్ వాటర్ అసలు ఎక్కడ పుట్టిందో మీకు తెలుసా? క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ నీరు తాగుతారని బాగా ప్రచారం పొందడంతో అసలు ఏంటీ బ్లాక్ వాటర్ అని అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఈ బ్లాక్ వాటర్ ధర, ఎవరెవరు ఈ వాటర్ తాగుతారు? ఇలాంటి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2008 ప్రాంతంలో ఓ కెనడియన్ కుటుంబం బ్లాక్ వాటర్‌ను హెల్త్ సప్లిమెంట్‌గా వాడింది. దీంతో వారికి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గడం ప్రారంభమయ్యాయి. దీంతో ఆ నీటిని పరీక్షించిన వైద్యులు ఈ నీళ్లలో మామూలు నీళ్ల కన్నా పోషకాలు ఎక్కువ అని గుర్తించారు. బ్లాక్ వాటర్‌లో ఆర్గానిక్ కాంపౌండ్స్‌తో పాటు ఫుల్విక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఈ యాసిడ్ వల్లే నీళ్లు కొద్దిగా నల్లగా ఉంటాయి. విరాట్ కోహ్లీతో పాటు చాలామంది సెలబ్రిటీలు ఈ నీళ్లు తాగుతారు. దీని నీటి పుట్టుక, విశేషాల గురించి తెలుసుకుందాం.

బ్లాక్ వాటర్ ఎక్కడ పుట్టింది 

బ్లాక్ వాటర్ కాన్సెప్ట్ కెనడాలో మొదలైంది. కెనెడియన్ కుటుంబం సాధించిన రిజల్ట్స్ చూసి ప్రైవేటుగా బ్లాక్ వాటర్ తయారు చేయడం ప్రారంభించారు. స్ప్రింగ్ వాటర్‌లో ఫుల్విక్ యాసిడ్ కలిపి బ్లాక్ వాటర్ తయారు చేస్తారు. 2011లో బ్లాక్ వాటర్ మార్కెటింగ్‌ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు ఈ నీటిని తాగడం మొదలుపెట్టారు.

చైనీస్ మెడిసిన్‌లో ఫుల్విక్ యాసిడ్ 

చైనీస్ మెడిసిన్, ఆయుర్వేదంలో ఫుల్విక్ యాసిడ్‌ను వేల సంవత్సరాలుగా వాడుతున్నారు. సిలాజిత్ లో కూడా 15-20% ఫుల్విక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఇమ్యూనోమోడ్యులేటర్, యాంటీఆక్సిడెంట్, డైయూరేటిక్, హైపోగ్లైసీమిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. అందువల్లనే ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. తద్వారా శరీరంలోని రోగాలను తగ్గించడానికి ఈ నీరు ఉపయోగపడుతుంది. 

బ్లాక్ వాటర్ ను ఫుల్విక్ వాటర్ లేదా ఆల్కలైన్ వాటర్ అని కూడా అంటారు. సాధారణ నీటి pH స్థాయి 6 నుండి 7 వరకు ఉంటే, బ్లాక్ వాటర్‌లో ఇది 8.5 వరకు ఉంటుంది. ఇది శరీరంలోని ఆమ్ల స్థాయిలను తగ్గించడంలో, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్ సరఫరాను పెంపొందించడంలో సహాయపడుతుంది. 

ఇది కూడా చదవండి  హార్ట్ పేషెంట్స్ వేసవిలో రోజుకు ఇన్ని లీటర్ల నీరే తాగాలి? లేకపోతే ప్రమాదమే

బ్లాక్ వాటర్ ధర 

మార్కెట్‌లో చాలా కంపెనీలు బ్లాక్ వాటర్‌ను అమ్ముతున్నాయి. 500 ml బాటిల్ 100 నుంచి 200 రూపాయల వరకు ఉంటుంది. పోషకాలను బట్టి ధర మారుతుంది. లీటరు బ్లాక్ వాటర్ 4000 నుంచి 24,000 రూపాయల వరకు ఉంటుంది. ఇది బాడీని డిటాక్స్ చేస్తుంది. గట్ బ్యాక్టీరియాను పెంచుతుంది. వయసు పెరుగుతున్నా ఆ ప్రభావం శరీరంపై కనిపించకుండా చూస్తుంది. 

విరాట్ కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ ధర

విరాట్ కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ ధర లీటరుకు సుమారు రూ. 3,000 నుండి రూ. 4,000 వరకు ఉంటుంది.  ఈ బ్లాక్ వాటర్‌ను 'నల్ల ఆల్కలైన్ నీరు' అని కూడా అంటారు. ఇందులో సహజసిద్ధమైన ఆల్కలైన్, 70 కంటే ఎక్కువ రకాల ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

RBI Repo Rate Cut: మీకు లోన్ ఉందా, అయితే గుడ్ న్యూస్‌.. ఏ లోన్ పై ఎంత ఈఎమ్ఐ త‌గ్గుతుందో తెలుసా.?
OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది