Supreme Court Jobs: డిగ్రీ ఉంటే చాలు.. సుప్రీం కోర్టులో జాబ్.. టైమ్ దాటకముందే అప్లై చేసుకోండి

Published : Mar 08, 2025, 12:46 PM IST
Supreme Court Jobs: డిగ్రీ ఉంటే చాలు.. సుప్రీం కోర్టులో జాబ్.. టైమ్ దాటకముందే అప్లై చేసుకోండి

సారాంశం

Supreme Court Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సుప్రీం కోర్టులో గ్రూప్ 'బి' నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి అప్లై చేయడానికి డిగ్రీ పూర్తి చేసి ఉంటే చాలు. సెలెక్ట్ అయితే రూ.74,000 శాలరీ ఇస్తారు. మరి ఈ జాబ్స్ కి మీరు అర్హులేనా? ఇక్కడ చెక్ చేసుకోండి. 

సుప్రీం కోర్టులో ఖాళీగా ఉన్న 241 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు వెంటనే అప్లై చేయండి.

సుప్రీం కోర్టులో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి

భారత సుప్రీం కోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ (గ్రూప్ 'బి' నాన్-గెజిటెడ్) ఉద్యోగానికి 241 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఫిబ్రవరి 4న నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.

విద్యార్హత: ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి గుర్తింపు పొందిన విద్యా సంస్థలో ఏదైనా డిగ్రీ పూర్తి చేస్తే చాలు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా కంప్యూటర్ వాడటం తెలిసి ఉండాలి. అలాగే నిమిషానికి 35 పదాలు టైప్ చేసే స్కిల్ కచ్చితంగా ఉండాలి.

వయో పరిమితి: ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. 30 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు. రూల్స్ ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. అంటే ఎస్సీ/ఎస్టీ వాళ్లకు 5 ఏళ్లు, ఓబీసీ వాళ్లకు 3 ఏళ్లు, జనరల్ కేటగిరీ దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ దివ్యాంగులకు 15 ఏళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

శాలరీ: కోర్టు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి  అన్ని పరీక్షలు పాసై సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు రూ.74,000 శాలరీ ఇస్తారు.

జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులకు ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడ?

జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టుల ఎంపికలో భాగంగా ముందుగా రాత పరీక్ష ఉంటుంది. తర్వాత టైపింగ్ టెస్ట్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, విజయవాడ, వైజాగ్, తిరుపతి తదితర నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 

అప్లై చేయడం ఎలా?: అభ్యర్థులు ఈ ఉద్యోగానికి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. https://www.sci.gov.in/ అనే అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.1000 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే చాలు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చేయండి. 

ఇది కూడా చదవండి నిరుద్యోగులకు గుడ్ న్యూస్, రైల్వే లోకో పైలట్ రిక్రూట్మెంట్‌కు ఎగ్జామ్ డేట్ కన్ఫమ్

PREV
click me!

Recommended Stories

RBI Repo Rate Cut: మీకు లోన్ ఉందా, అయితే గుడ్ న్యూస్‌.. ఏ లోన్ పై ఎంత ఈఎమ్ఐ త‌గ్గుతుందో తెలుసా.?
OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది