రైళ్ల ప్రైవేటీకరణపై మరో కీలక నిర్ణయం.. ప్రైవేట్ రైళ్ల ఆపరేటర్లకు సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరి..

By Sandra Ashok KumarFirst Published Oct 31, 2020, 3:45 PM IST
Highlights

ప్రైవేటు సంస్థలు దేశంలోని 113 రూట్లలో 151 ప్యాసింజర్ రైళ్లను త్వరలో నడపనున్నాయి. రైళ్ల ప్రైవేటీకరణపై దేశవ్యాప్తంగా చాలా మంది భారత రైల్వేపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికి రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన దశ అని రైల్వేశాఖ వివరిస్తోంది. 

ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ప్రైవేటు సంస్థలు దేశంలోని 113 రూట్లలో 151 ప్యాసింజర్ రైళ్లను త్వరలో నడపనున్నాయి.  రైళ్ల ప్రైవేటీకరణపై దేశవ్యాప్తంగా చాలా మంది భారత రైల్వేపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికి రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన దశ అని రైల్వేశాఖ వివరిస్తోంది.

ఇప్పుడు దీనికి సంబంధించి నీతి ఆయోగ్, రైల్వే అధికారులు 151 రైళ్ల ప్రైవేటీకరణ సమస్యలపై ఉన్న అడ్డంకులపై పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైసల్ కమిటీ (పిపిపిఎసి) తో సమావేశం నిర్వహించారు. ప్రైవేటు సంస్థలు ప్యాసింజర్ రైళ్లను నడుపుతున్నా, ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో మూడు శాతం సెక్యూరిటీ డిపాజిట్‌గా రైల్వేలకు జమ చేయాలని నిర్ణయించారు.

ఇది మాత్రమే కాకుండా భద్రతా ప్రమాణాలను నిర్ధారించడానికి రైల్వే అధికారులు స్టేషన్ నుండి రైలు బయలుదేరే ముందు ప్రైవేట్ రైళ్లను తనిఖీ చేస్తారు. కొన్ని మూలాల ప్రకారం ప్రైవేట్ కంపెనీలు సెక్యూరిటీ డిపాజిట్లను జమ చేయవలసిన అవసరం లేదని కొందరు అధికారులు అభిప్రాయపడ్డారు.

also read 

ఈ చర్య ద్వారా ప్రైవేట్ సంస్థలకు వ్యాపారాన్ని సులభతరం చేయాలని కమిషన్ కోరింది. ప్రైవేట్ రైళ్లు నడుపుతున్న 12 క్లస్టర్లలో ఈ కంపెనీలు 30 వేల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిసింది. అటువంటి పరిస్థితిలో, ఏ కంపెనీకైనా ఒక అంచనా ప్రకారం సెక్యూరిటీ డిపాజిట్ సుమారు వెయ్యి కోట్ల రూపాయల దాకా ఉంటుంది.

    ఏదైనా సంస్థ ఆర్థిక నష్టాలను భరించలేకపోతే లేదా సేవలను అందించలేకపోతే, ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటానికి ప్రభుత్వానికి కొంత ఆర్థిక పరపతి ఉండాలి అని కూడా సమావేశంలో నిర్ణయించారు. అందుకే ప్రైవేటు సంస్థల నుంచి సెక్యూరిటీ డిపాజిట్లు తీసుకోవడానికి అంగీకరించినట్లు పిపిపిఎసి వర్గాలు తెలిపాయి.

మరోవైపు రైళ్ల భద్రతను నిర్ధారించడానికి స్టేషన్ నుండి బయలుదేరే ముందు వాటిని తనిఖీ చేయడం వంటి వాటిపై ప్రైవేట్ కంపెనీలు అభ్యంతరం చెప్పలేదు. అయితే భవిష్యత్తులో రైలును సురక్షితంగా ఉంచే బాధ్యతను ప్రైవేటు ఆపరేటర్లు స్వయంగా తీసుకుంటారనే దానిపై  ప్రభుత్వ అధికారుల ఈ నియమాన్ని తొలగించవచ్చని సమావేశంలో చర్చించారు.

ఇప్పటి వరకు లార్సెన్ & టౌబ్రో (ఎల్ అండ్ టి), జిఎంఆర్ మరియు భెల్ సహా 15 కంపెనీలు 12 క్లస్టర్లకు 120 బిడ్లను అందించాయి. 

click me!