మధ్యతరగతి వారికోసం ఎల్‌ఐ‌సి కొత్త పాలసీ..టాక్స్ లేకుండా రూ.23 లక్షలు!

By Sandra Ashok Kumar  |  First Published May 7, 2020, 4:00 PM IST

ఇప్పుడు ఎల్‌ఐ‌సి మధ్యతరగతి వారి కోసం ఒక కొత్త మనీ బ్యాక్ ప్లాన్ అందిస్తోంది. ఇందులో రెండు రకాల మెచ్యూరిటీ ఆప్షనన్లు ఉంటాయి. 20 ఏళ్లు, 25 ఏళ్లు అనేవి మెచ్యూరిటీ ఆప్షన్స్. ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల ప్రకారం ఈ పాలసీపై ఈఈఈ ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు.


ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రజలకు వివిధ రకాల పాలసీలు అందిస్తు మంచి  నమ్మకాన్ని ఏర్పర్చుకుంది. అంతే కాదు మనీ బ్యాక్ పాలసీలు కూడా ఎల్‌ఐ‌సిలో ఒక భాగమే. ఇప్పుడు ఎల్‌ఐ‌సి మధ్యతరగతి వారి కోసం ఒక కొత్త మనీ బ్యాక్ ప్లాన్ అందిస్తోంది.

ఇందులో రెండు రకాల మెచ్యూరిటీ ఆప్షనన్లు ఉంటాయి. 20 ఏళ్లు, 25 ఏళ్లు అనేవి మెచ్యూరిటీ ఆప్షన్స్. ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల ప్రకారం ఈ పాలసీపై ఈఈఈ ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. అంటే మీరు చెల్లించే ప్రీమియం మొత్తం, వచ్చే రాబడి, మెచ్యూరిటీ సమయంలో పొందే డబ్బుపై పన్ను మినహాయింపును పొందొచ్చు అన్నమాట.

Latest Videos

ఒక వ్యక్తి 25 ఏళ్ల ఆప్షన్‌తో ఈ పాలసీని తీసుకుంటే రోజుకు రూ.160 చెల్లిస్తే సరిపోతుంది. దీనికి సంబంధించి సెబీ రిజిస్టర్డ్ ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుడు మణికరన్ సింఘాల్ మాట్లాడుతూ పాలసీదారుడికి ఈ మనీ బ్యాక్ పాలసీలో ఐదేళ్ల విరామంతో 15 శాతం లేదా 20 శాతం డబ్బు లభిస్తుందని తెలిపారు.

also read తస్మాత్ జాగ్రత్త!: ఈఎంఐల వాయిదా.. అసలుపై అదనపు భారం

ఒక వ్యక్తి రూ.10 లక్షల బీమా మొత్తానికి 25 ఏళ్ల కాల పరిమితితో ఎల్‌ఐసీ కొత్త మనీ బ్యాక్ పాలసీ తీసుకున్నాక ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే రూ.12.5 లక్షలు లభిస్తాయి. ఇప్పుడు తొలి ఏడాది ప్రీమియం రూ.60,025 అవుతుంది. అంటే ఆరు నెలల ప్రీమియం రూ.30,329. అదే మూడు నెలల ప్రీమియం ఆప్షన్ ఎంచుకుంటే రూ.15,323 చెల్లించాలి. నెల వారీ ప్రీమియం అయితే రూ.5,108 కట్టాలి అంటే రోజుకు రూ.165 అన్నమాట.

 20 ఏళ్లలో మీరు చెల్లించే ప్రీమియం మొత్తం దాదాపు రూ.12 లక్షలు అవుతుంది. 5 ఏళ్లకు ఒకసారి 15 శాతం చొప్పున డబ్బులు వెనక్కి వస్తాయి. ఇలా రూ.6 లక్షలు పొందొచ్చు. మిగతా 40 శాతం (రూ.4 లక్షలు) మెచ్యూరిటీ సమయంలో లభిస్తాయి. ఇక బోనస్ కింద రూ.11 లక్షలు వస్తాయి.

ఇక ఫైనాల్ అడిషనల్ బోనస్ రూ.2.25 లక్షలు. ఇప్పుడు మీకు మెచ్యూరిటీలో రూ.17.25 లక్షలు వస్తాయి. ముందు తీసుకున్నరూ.6 లక్షలతో  మొత్తంగా రూ.23 లక్షలు లభిస్తాయి.ఈ రోజుల్లో ఎల్‌ఐ‌సి పాలసీ అందరికీ ఉంటుంది.  మధ్య తరగతి వారికి ఈ పాలసీ చాలా లాభదాయకంగా ఉండనుంది. 

click me!