ఇక ప్రముఖులకు సంబంధించిన ఫేక్ న్యూస్ చాలా వేగంగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంటుంది. ఇప్పుడు రతన్ టాటాకు అలాంటి సంధర్భం ఎదురైంది. దీంతో ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు. అంతేకాదు తాను చెప్పని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంబధిత నకిలీ వార్తాలను షేర్ చేసిన రతన్ టాటా ఇది కూడా నన్ను భయపెడుతోంది.
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత రతన్ టాటా మరోసారి ఆందోళనకు గురయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించింది. దీంతో ఇంటర్నెట్ వినియోగం మరింతగా పెరిగింది. ప్రజలు ఎక్కువగా సోషల్ మీడియా పైనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
ఒకోసారి ఒకరికి తెలియకుండానే వారి గురించి తప్పుడు సమాచారం వైరల్ అవుతుంటుంది. ఇక ప్రముఖులకు సంబంధించిన ఫేక్ న్యూస్ చాలా వేగంగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంటుంది. ఇప్పుడు రతన్ టాటాకు అలాంటి సంధర్భం ఎదురైంది. దీంతో ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు.
అంతేకాదు తాను చెప్పని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంబధిత నకిలీ వార్తాలను షేర్ చేసిన రతన్ టాటా ఇది కూడా నన్ను భయపెడుతోంది. ఇది నేను చెప్పలేదంటూ ట్వీట్ చేశారు. తన ఫోటో ఉన్నంత మాత్రాన ఆ మాటలు నేను చెప్పినట్టు కాదని ఆయన పేర్కొన్నారు.
also read గుడ్ న్యూస్ : 5 నిముషాల్లో ఎస్‌బిఐ లోన్.. 6 నెలల వరకు నో ఈఎంఐ...
ఇలాంటి నకిలీ వార్తలపై తనకు వీలైన సమయాల్లో స్పందిస్తానని చెప్పారు. కానీ వీటిపట్ల అప్రమత్తంగా వుండాలని, ఇలాంటి వాటిని నిర్ధారించుకోవాలంటూ రతన్ టాటా మరోసారి సూచించారు.
రతన్ టాటా ఆదివారం సాయంత్రం వివరణ ఇచ్చిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షకు పైగా లైక్‌లు, వేలాది మంది రీట్వీట్‌లను చేశారు. కాగా గత నెలలో కరోనా వైరస్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావం గురించి రతన్ టాటా అభిప్రాయం పేరుతో ఒక నకలీ వార్త బాగా వైరల్ అయింది.
దీంతో స్వయంగా రతన్ టాటా ఆ అభిప్రాయం తనది కాదని, తాను అసలు అలా చెప్పలేదంటూ ట్విటర్ ద్వారా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి తప్పుడు వార్తలు ఎక్కడి నుండి పుడతాయో, ఎవరు సృష్టిస్తారో వాటి వల్ల తనకు ఆందోళన గురిచేస్తుందన్నారు.