India emerges as largest exporter: ఆ ఎగుమ‌తుల్లో దూసుకుపోతున్న భార‌త్‌..!

By team teluguFirst Published Jan 23, 2022, 12:00 PM IST
Highlights

ప్రపంచంలో కీర దోస‌కాయ‌ల‌ను అత్యధికంగా ఎగుమతి చేసే దేశంగా భారత‌దేశం అవతరించింది. భారతదేశం గ‌తేడాది ఏప్రిల్-అక్టోబర్ (2020-21) కాలంలో యూఎస్‌డీ 114 మిలియన్ల విలువతో కూడిన‌ 1,23,846 మెట్రిక్ టన్నుల కీర దోస‌కాయ‌ల‌ను, ఊర దోస‌కాయ‌ల‌ (గెర్కిన్‌ల)ను ఎగుమతి చేసింది. 

ప్రపంచంలో కీర దోస‌కాయ‌ల‌ను అత్యధికంగా ఎగుమతి చేసే దేశంగా భారత‌దేశం అవతరించింది. భారతదేశం గ‌తేడాది ఏప్రిల్-అక్టోబర్ (2020-21) కాలంలో యూఎస్‌డీ 114 మిలియన్ల విలువతో కూడిన‌ 1,23,846 మెట్రిక్ టన్నుల కీర దోస‌కాయ‌ల‌ను, ఊర దోస‌కాయ‌ల‌ (గెర్కిన్‌ల)ను ఎగుమతి చేసింది. భారతదేశం వ్యవసాయ ఉత్పత్తి యూఎస్‌డీ 200 మిలియన్ల మార్కును దాటింది. గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2020-21లో భారతదేశం యూఎస్‌డీ 223 మిలియన్ల విలువతో 2,23,515 మెట్రిక్ టన్నుల కీర‌ దోసకాయల‌ను, గెర్కిన్‌లను రవాణా చేసింది. 

వాణిజ్య శాఖ, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆదేశాలను అనుసరించి వ్యవసాయ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, గ్లోబల్ మార్కెట్‌లో ఉత్పత్తి ప్రమోషన్, ప్రాసెసింగ్‌లో ఫుడ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు కట్టుబడి ఉండటంలో వరుస కార్యక్రమాలను చేపట్టింది. గెర్కిన్‌లు రెండు వర్గాల క్రింద ఎగుమతి అవుతున్నాయి. కీర‌ దోసకాయలు, గెర్కిన్‌ల రూపంలో ఎగుమ‌తి అవుతున్నాయి. వీటిని భ‌ద్ర‌ప‌ర‌చాడానికి వెనిగర్ లేదా ఎసిటిక్ యాసిడ్ ప‌దార్థాలు వాడ‌తారు.

భారతదేశంలో గెర్కిన్ సాగు 1990 సంవ‌త్స‌రంలో క‌ర్ణాట‌క‌లో ప్రారంభ‌మైంది. త‌ర్వాత పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు ఈ సాగు విస్తరించింది. ప్రపంచంలో గెర్కిన్‌ల 15 శాతం ఉత్పత్తి భారతదేశంలోనే పండుతోంది. 

గెర్కిన్స్ ప్రస్తుతం 20 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయబడుతోంది. ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలు, యూఎస్ఏ, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, స్పెయిన్, దక్షిణ కొరియా, కెనడా, జపాన్, బెల్జియం, రష్యా, చైనా, శ్రీలంక, ఇజ్రాయెల్ దేశాల‌కు గెర్కిన్స్ ను భార‌త్ ఎగుమ‌తి చేస్తుంది. ఎగుమతి సామర్థ్యంతో పాటు గ్రామీణ ఉపాధి కల్పనలో గెర్కిన్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశంలో 65,000 ఎకరాల వార్షిక ఉత్పత్తి విస్తీర్ణంతో సుమారు 90,000 మంది చిన్న, సన్నకారు రైతులు ఒప్పంద వ్యవసాయం కింద గెర్కిన్‌ల సాగును నిర్వహిస్తున్నారు. గెర్కిన్లు పారిశ్రామిక ముడి పదార్థంగా, తినడానికి సిద్ధంగా ఉన్న పాత్రలలో పెద్దమొత్తంలో ఎగుమతి చేస్తారు. భారతదేశంలో సుమారు 51 ప్రధాన కంపెనీలు డ్రమ్స్ మరియు రెడీ-టు-ఈట్ కన్స్యూమర్ ప్యాక్‌లలో గెర్కిన్‌లను ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నాయి.

ఒక రైతు స‌గ‌టున‌ ఒక ఎకరానికి 4 మెట్రిక్ టన్నుల గెర్కిన్‌ను ఉత్పత్తి చేస్తాడు. రూ. 40,000 నికర ఆదాయంతో సుమారు రూ.80,000 సంపాదిస్తాడు. గెర్కిన్ పంట‌ 90 రోజుల పంట. రైతులు ఏటా రెండు పంటలు వేస్తారు. విదేశీ కొనుగోలుదారుల అవసరాలను తీర్చడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రాసెసింగ్ ప్లాంట్లు భార‌త‌దేశంలో స్థాపించబడ్డాయి. గెర్కిన్ తయారీ, ఎగుమతి కంపెనీలు ISO, BRC, IFS, FSSC 22000 సర్టిఫైడ్, HACCP సర్టిఫికేట్ లేదా అన్ని ధృవపత్రాలను కలిగి ఉంటుంది. APEDA గెర్కిన్‌ల‌ ఉత్పత్తి, ఎగుమతి విలువను పెంచడానికి విలువల‌ జోడింపుపై కూడా దృష్టి సారిస్తోంది.

click me!