Hydrogen truck: హైడ్రోజన్ తో నడిచే లారీలు వచ్చేస్తున్నాయ్. ఒక్కసారి ఫిల్ చేస్తే 500 కి.మీ నాన్ స్టాప్

Published : Mar 06, 2025, 06:30 PM IST
Hydrogen truck: హైడ్రోజన్ తో నడిచే లారీలు వచ్చేస్తున్నాయ్. ఒక్కసారి ఫిల్ చేస్తే 500 కి.మీ నాన్ స్టాప్

సారాంశం

Hydrogen-powered truck: డీజిల్‌తో నడిచే లారీలను ఇప్పుడు మనం చూస్తున్నాం. కాని చాలా కొద్ది రోజుల్లో భారతదేశంలో హైడ్రోజన్‌తో నడిచే లారీలు రాబోతున్నాయి. ఈ లారీలను టాటా మోటార్స్ తయారు చేసింది. ఈ ట్రక్ ని ఒకసారి హైడ్రోజన్ తో ఫిల్ చేస్తే 500 కి.మీ. వరకు నాన్ స్టాప్ గా ప్రయాణిస్తుంది. ఈ హైడ్రోజన్ లారీ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

Hydrogen-powered truck: టాటా మోటార్స్ సంస్థ భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్‌తో నడిచే భారీ లారీల ట్రయల్ రన్‌ను ప్రారంభించింది. సుదూర సరకు రవాణాను మరింత స్థిరంగా, పర్యావరణానికి అనుకూలంగా మార్చడంలో ఇది చారిత్రాత్మక అడుగు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.  

హైడ్రోజన్ లారీ గురించి నితిన్ గడ్కరీ ఏమన్నారంటే.. 

హైడ్రోజన్‌తో నడిచే లారీని ఇటీవల ట్రయల్ రన్ కూడా చేశారు. ఈ ట్రయల్ రన్‌ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మార్చి 4, 2025న ప్రారంభించారు. ఈ వేడుకలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ''హైడ్రోజనే భవిష్యత్తులో ఇంధనంగా ఉండబోతోంది. ఇది భారతదేశ రవాణా రంగాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంది. ఇది కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా భారతదేశ ఇంధన సామర్థ్యాన్ని కూడా బలోపేతం చేస్తుంది. భారతదేశంలో గ్రీన్, స్మార్ట్ రవాణా దిశగా ఈ విప్లవాత్మక చర్యకు ప్రయత్నిస్తున్నందుకు టాటా మోటార్స్‌ను అభినందిస్తున్నాను.'' అని అన్నారు.

ఇది కూడా చదవండి టాటా కార్లలో చీప్ అండ్ బెస్ట్ కారు ఇదే. దీనిపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్. ఆలస్యం చేయకండి

ముఖ్యమైన సరకు రవాణా మార్గాల్లో ట్రయల్ 

హైడ్రోజన్‌తో నడిచే లారీ ట్రయల్ రాబోయే 24 నెలల పాటు కొనసాగుతుంది. ఇంకా వివిధ సామర్థ్యాలు, నిర్మాణాలతో 16 అత్యాధునిక హైడ్రోజన్ లారీలు రోడ్లపై తిరుగుతాయి. హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (H2-ICE), ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ (H2-FCEV) ఈ లారీల్లో వాడారు.

ఈ లారీలను ముంబై, పూణే, ఢిల్లీ-ఎన్‌సీఆర్, సూరత్, వడోదర, జంషెడ్‌పూర్, కళింగనగర్ వంటి భారతదేశంలోని ప్రధాన సరకు రవాణా మార్గాల్లో పరీక్షిస్తారు.

హైడ్రోజన్ లారీల ప్రత్యేకత ఏమిటి?

ఈ ట్రయల్ కోసం ఉపయోగించే లారీలను టాటా మోటార్స్ హైడ్రోజన్ మొబిలిటీ టెక్నాలజీ ఉపయోగించి తయారుచేసింది. వీటిలో రెండు వేర్వేరు రకాల టెక్నాలజీలు ఉన్నాయి. అవి హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (H2-ICE), హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ (H2-FCEV).

500 కి.మీ. వరకు ప్రయాణించే సామర్థ్యం 

ఈ లారీల ఆపరేటింగ్ రేంజ్ 300 నుంచి 500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇవి నిలకడగా, పొదుపుగా, అధిక పనితీరు గల రవాణాను అందించేలా తయారయ్యాయి. ఈ లారీల్లో ప్రీమియం ప్రైమా క్యాబిన్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సేఫ్టీ ఫీచర్లు, బెస్ట్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇది డ్రైవర్‌ను చాలా సౌకర్యవంతంగా ఉంచుతాయి. ఈ లారీలు నడపడం వల్ల తక్కువ అలసట కలుగుతుంది. అంతేకాదు, ఈ లారీలు రవాణా రంగంలో కొత్త సేఫ్టీ ప్రమాణాలను నెలకొల్పుతాయి.

హైడ్రోజన్ లారీలపై టాటా మోటార్స్ అంచనాలు

హైడ్రోజన్ లారీల గురించి టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ ఏమన్నారంటే.. "భారతదేశంలో గ్రీన్, స్మార్ట్, స్థిరమైన రవాణాను ముందుకు తీసుకెళ్లడంలో టాటా మోటార్స్ ముందుండటం గర్వంగా ఉందన్నారు. టాటా కంపెనీ ఎల్లప్పుడూ కొత్త ఆవిష్కరణలను స్వీకరించి, కొత్త రవాణా పరిష్కారాలను రూపొందిస్తుంది అన్నారు. హైడ్రోజన్ లారీలదో దూర ప్రయాణాలు సులభంగా మారతాయి. స్వచ్ఛమైన, జీరో ఎమిషన్ ఎనర్జీ వైపు టాటా కంపెనీ అడుగులు వేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

ఇది కూడా చదవండి ఇండియాలో ల్యాండ్ క్రూజర్ ప్రాడో ఎన్ని రూ.కోట్లో తెలుసా?

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Electric Scooter: లక్ష మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది.. ఓలాకు చుక్కలు చూపించింది
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !