‘టిక్‌టాక్‌’పై నిషేధం ఎత్తివేత: కానీ, షరతులు వర్తిస్తాయి!

By rajashekhar garrepallyFirst Published Apr 25, 2019, 10:41 AM IST
Highlights

తక్కువ కాలంలో ఎక్కువ మంది యువతను ఆకట్టుకున్న వినోదపు వీడియో యాప్ టిక్‌టాక్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. మదురై ధర్మాసనం టిక్‌టాక్‌పై విధించిన నిషేధాన్ని బుధవారం ఎత్తివేసింది. అయితే, కొన్ని షరతులను విధించింది. 

చెన్నై: తక్కువ కాలంలో ఎక్కువ మంది యువతను ఆకట్టుకున్న వినోదపు వీడియో యాప్ టిక్‌టాక్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. మదురై ధర్మాసనం టిక్‌టాక్‌పై విధించిన నిషేధాన్ని బుధవారం ఎత్తివేసింది. అయితే, కొన్ని షరతులను విధించింది. 

టిక్‌టాక్ యాప్ అశ్లీలతను పెంచుతోందని ముత్తుకుమార్ అనే న్యాయవాది వేసిన కేసు ఆధారంగా హైకోర్టు దీనిపై మధ్యంతర నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. అయితే, నిషేధం ఎత్తివేత సందర్భంగా టిక్‌టాక్ కోర్టు పలు కీలక షరతులను విధించింది. 

పోర్నోగ్రఫీ వంటి వీడియోలను అప్‌లోడ్‌ చేయకూడదంటూ స్పష్టం చేసింది. ఆ విషయంలో వైఫల్యం చెందితే కోర్టు ధిక్కరణ కింద విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు తేల్చి చెప్పింది. 

అశ్లీల వీడియోలు కారణంగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి వీల్లేకుండా నిషేధం విధించాలంటూ ఏప్రిల్ 3న హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటికీ దానిపై విచారణ జరుగుతుండటంతో హైకోర్టు ఆదేశాలపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. 

ఏప్రిల్ 18 నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో టిక్‌టాక్ యాప్‌ను తొలగించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ టిక్‌టాక్ యాప్ మాతృ సంస్థ అయిన చైనా కంపెనీ బైట్ డ్యాన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

ఈ క్రమంలో మద్రాసు హైకోర్టు దీనిపై నిర్ణయం తీసుకోవాలని, లేదంటే నిషేధం ఎత్తివేయాల్సి వస్తుందని సుప్రీం ఇటీవల అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే మద్రాసు హైకోర్టు పలు షరతులను విధిస్తూ నిషేధం ఎత్తివేసింది.

సంబంధిత వార్త: బ్యాన్ ఎఫెక్ట్: టిక్‌టాక్‌కు డైలీ రూ.3.5కోట్ల నష్టం, రిస్కులో ఉద్యోగాలు!

click me!