మారిన బ్యాంక్‌ టైమింగ్స్‌.. ఆ సమస్యకు చెక్‌ పెట్టేందుకే..

By Narender Vaitla  |  First Published Jan 3, 2025, 12:06 PM IST

ప్రస్తుతం ప్రజలకు బ్యాంకుతో సంబంధాలు ఎక్కువయ్యాయి. దేశంలో ప్రతీ ఒక్కరికీ బ్యాంక్‌ ఖాతా ఉండాలన్న లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల అమలు కోసం బ్యాంకు ఖాతాలు అనివార్యంగా మారాయి. బ్యాంకులతో కస్టమర్లకు సంబంధాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్యాంకు సమయాల్లో మార్పుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.. 
 


బ్యాంకులకు, కస్టమర్లకు మధ్య సంబంధాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్యాంకుల సెలవులు, పనివేళలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. బ్యాంకులు సైతం కస్టమర్లకు ఎస్‌ఎమ్‌ఎస్‌ల రూపంలో ఎప్పటికప్పుడు విషయాలను వెల్లడిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బ్యాంకు పనివేళల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం.. 

సాధారణంగా ఒక్కో బ్యాంకుకు ఒక్కో పనివేళలు ఉంటాయి. బ్యాంకులు తెరిచే సమయం, మూసివేసే సమయాల్లో మార్పులు ఉండడం సర్వసాధారణమైన విషయం. పేరుకు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులే అయినప్పటికీ పనివేళల్లో మాత్రం తేడాలు ఉంటాయి. దీంతో ఖాతాదారులు పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

Latest Videos

అన్ని బ్యాంకులకు ఒకే సమయం

బ్యాంకింగ్ సేవలను మెరుగుపరిచేందుకు, ఖాతాదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జాతీయ బ్యాంకుల పనివేళలు ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయాన్ని 2025 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. 

ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు ఉదయం 10 గంటలకు తెరిచి సాయంత్రం 4 గంటలకు మూసివేస్తారు. బ్యాంకింగ్ సేవలను క్రమబద్ధీకరించడంలో ఈ చర్య సహాయపడుతుందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

మార్పు ఎందుకు.? 

బ్యాంకులకు వేర్వేరు సమయాలు ఉన్న కారణంగా కస్టమర్లు గందరగోళానికి గురవుతున్నారు. కొన్ని బ్యాంకులు ఉదయం 10 గంటలకు తెరుచుకోగా, మరి కొన్ని బ్యాంకులు 10:30 లేదా 11 గంటలకు తెరుచుకుంటున్నాయి. దీనివల్ల బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు వెళ్లాల్సిన ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే ఏకరీతి పనివేళలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో గందరగోళం తొలగిపోవడంతో వినియోగదారులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారు. 

ఇతర రాష్ట్రాల్లో కూడా.? 

మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇతర రాష్ట్రాలు అమలు చేసే అవకాశాలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని బ్యాంకులు ఒకే సమయంలో పని చేయడం వల్ల ఇంటర్-బ్యాంక్ లావాదేవీలు, కస్టమర్ రిఫరల్స్ వంటి సేవల్లో మెరుగైన సమన్వయం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం ఉద్యోగులకు కూడా మేలు చేస్తుందని, ఆఫీసు షిఫ్ట్‌ల్లో మెరుగైన ప్రణాళికలు సహాయపడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇవికూడా చదవండి: లోన్‌ తీసుకునే వారికి పండగలాంటి వార్త.. మారిన ఆర్బీఐ నిబంధనలతో జరిగే లాభం ఇదే

ఇవి కూడా చదవండి: ఇంట్లోకి పాములు రావడానికి ఈ మొక్కలే కారణం.. వెంటనే తీసేయండి..
 

click me!