ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇది మీకు కచ్చితంగా శుభవార్తే. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ముఖ్యమైన బ్రాండెడ్ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లపై రూ.3 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించాయి. ఆ కంపెనీలు, వాటి కార్లు, ఫీచర్స్ తెలుసుకుందాం రండి.
ఎలక్ట్రిక్ కార్ల ధరలు మరింత తగ్గనున్నట్లు టాటా అధికారికంగా ప్రకటించింది. Nexon EVపై దాదాపు 3 లక్షల రూపాయల వరకు తగ్గింపు ఇస్తోంది. అధికారిక ప్రకటన ప్రకారం బ్యాటరీ ధర తగ్గించడం ద్వారా తన కస్టమర్లకు టాటా కంపెనీ లబ్ధి చేకూర్చనుంది. టాటా మాత్రమే కాదు మహీంద్రా కంపెనీ కూడా దాని XUV 400 EVపై దాదాపు 3 లక్షల రూపాయల తగ్గింపును అందిస్తోంది.
టాటా, మహీంద్రా, ఏథర్ ఎనర్జీ, హీరో వంటి ఆటోమొబైల్ కంపెనీలు భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. ఇన్వెంటరీలో వాహనాల నిల్వలు ఉండటమే ఈ డిస్కౌంట్లకు కారణమని తెలుస్తోంది.
బ్యాటరీ ధర తగ్గించడం ద్వారా కస్టమర్లకు లబ్ధి చేకూర్చడమే తమ లక్ష్యమని టాటా కంపెనీ అధికారికంగా ప్రకటించింది. టాటా మోటార్స్ Nexon EVపై 3 లక్షల రూపాయల వరకు ధరను తగ్గిస్తోంది.
అధికారిక వార్తల ప్రకారం CAFE (కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్యం) నిబంధనలను తీర్చడానికి కార్ల కంపెనీలు ఇటువంటి తగ్గింపులను అందిస్తున్నాయి.
టాటా కంపెనీకి చెందిన విజయవంతమైన కార్లలో హారియర్, సఫారీ ముందుంటాయి. ఈ రెండు వాహనాల EV వెర్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో డ్యూయల్-మోటార్ AWD సెటప్ ఉన్నాయి. ఎంట్రీ లెవల్ వేరియంట్‌లకు సింగిల్-మోటార్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. వాహనం బ్యాటరీ సామర్థ్యం గురించి బ్రాండ్ ఎటువంటి వివరాలను వెల్లడించనప్పటికీ, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే కారు దాదాపు 450 నుంచి 550 కి.మీల వెళ్లగలదని స్పష్టమవుతోంది. ఈ కారు ICE హారియర్ స్టైలింగ్‌ను దగ్గరగా పోలి ఉంటుంది.
టాటా కంపెనీ తన EV శ్రేణిలో వాహనాలను పెంచే ప్రణాళికలు వేస్తోంది. కాబట్టి త్వరలో EV సఫారీ కూడా రానుంది. 2025లో విడుదల కానున్న కొత్త సఫారీ, సఫారీ మోనికర్‌కు ప్రత్యేకంగా మూడు-వరుస సీట్ల EV MPVగా ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 400 నుండి 500 కి.మీల వెళుతుంది.
హ్యుందాయ్ క్రెటా తన EV వెర్షన్ ని రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ వాహనం EV స్పెక్ గ్రిల్‌తో వస్తోంది. కొత్త ఏరో వీల్స్‌తో పాటు కొత్త EV స్పెక్ స్టీరింగ్ వీల్ ఈ కారులో ఉన్న ప్రత్యేకతలు. సాధారణ క్రెటా ఇంటీరియర్‌ను కూడా ఈ వాహనం కలిగి ఉంటుంది. 48 KWH బ్యాటరీ ప్యాక్, 134 BHP, 255 NM గరిష్ట టార్క్‌ను అందిస్తుంది.
హ్యుందాయ్ కొత్త సబ్ 4 మీటర్ కాంపాక్ట్ EV SUVని ప్రారంభించాలని చూస్తోంది. దీన్ని వెన్యూ ICE వెర్షన్ ఆధారంగా రూపొందించారు. ఈ వాహనం సాధారణ వెన్యూ లాంటి డిజైన్‌ను కలిగి ఉంటుంది. భారతీయ మార్కెట్లో తక్కువ ధరకు EVని అందించేందుకు హ్యుందాయ్ ప్రయత్నిస్తోంది.
XUV 700 EV వాహనానికి XEV7e అని పేరు పెట్టి త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. XEV 7e అనేది XEV 700 పూర్తి EV వెర్షన్. ఇది XEV 9e మోడల్ ని పోలి ఉంటుంది. సోషల్ మీడియాలో లీక్ అయిన చిత్రాల ప్రకారం ఈ కారు ఇంటీరియర్ XEV 9e మాదిరిగానే ఉంటుందని స్పష్టమవుతోంది.
వాహనాన్ని శక్తివంతం చేసే బ్యాటరీ ప్యాక్ గురించి మహీంద్రా ఇంకా ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. ఇది XEV 9eలో అందించిన అదే బ్యాటరీ ప్యాక్ నే కలిగి ఉండే ఛాన్స్ ఉంది.