లోన్‌ తీసుకునే వారికి పండగలాంటి వార్త.. మారిన ఆర్బీఐ నిబంధనలతో జరిగే లాభం ఇదే

By Narender Vaitla  |  First Published Jan 3, 2025, 10:51 AM IST

మారిన ఆర్థిక అవసరాల నేపథ్యంలో చాలా మంది రుణాలు తీసుకుంటున్నారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు సైతం పెద్ద ఎత్తున రుణాలు అందిస్తున్నాయి. అయితే రుణం పొందాలంటే సిబిల్‌ స్కోర్‌ హెల్తీగా ఉండాలని తెలిసిందే. కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్ల కారణంగా కొందరి సిబిల్‌ స్కోర్‌ పడిపోతుంటుంది. దీంతో భవిష్యత్తులో ఇది రుణం తీసుకునే విషయంలో ఇబ్బందులకు దారి తీస్తుంది. అయితే తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం రుణ గ్రహితలకు ఊరటనిస్తోంది.. 
 


రుణ గ్రహిత రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైతే తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసిందే. ఒక్క ఈఎమ్‌ఐ చెల్లించడంలో ఆలస్యమైనా సిబిల్‌ స్కోర్‌ దెబ్బతింటుంది. ఈఎమ్‌ఐ చెల్లించడంలో విఫలమైన కస్టమర్ల జాబితాను బ్యాంకులు సిబిల్‌ సంస్థలకు అందజేస్తాయి. అయితే ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం సిబిల్‌ సంస్థలకు తెలియజేసే కంటే ముందే బ్యాంకులు తమ ఖాతాదారులకు ఆ విషయాన్ని తెలియజేస్తాయి. 

దీని ఉపయోగం ఏంటంటే.. 

లోన్‌ చెల్లించిన వారి వివరాలను సిబిల్‌ కంపెనీల కంటే ముందే ఖాతాదారులకు తెలియజేయడం ద్వారా ఖాతాదారుల సిబిల్‌ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం పడదు. సిబిల్‌ నివేదిక చెడిపోకముందే ఖాతాదారులను అప్రమత్తం చేస్తుంది.

Latest Videos

అలాగే ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన ప్రకారం ఏదైనా కంపెనీ ఖాతాదారుడి సిబిల్‌ స్కోర్‌ను చెక్‌ చేసిన ప్రతీసారి కస్టమర్‌కు పోస్ట్‌ ద్వారా ఆ సమాచారాన్ని అందించాలి. కస్టమర్‌ ప్రతీ సంవత్సరం పూర్తి క్రెడిట్‌ నివేదికను ఉచితంగా పొందుతారు. 

30 రోజుల్లో పరిష్కరించాలి.

ఆర్బీఐ ఈ సరికొత్త విధానాన్ని 2024 ఏప్రిల్‌ 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఇక ఎవరైనా ఖాతాదారుడు తన సిబిల్‌ స్కోర్‌కు సంబంధించి ఫిర్యాదు చేస్తే కంపెనీ కచ్చితంగా 30 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. లేదంటే కంపెనీ ప్రతీ రోజూ రూ. 100 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

అదే విధంగా ఖాతాదారుడు తన క్రెడిట్‌ స్కోర్‌ చెక్‌ చేసుకున్నప్పుడుల్లా.. క్రెడిట్ రేటింగ్‌ను మెరుగుపరుచుకునేందుకు అవసరమైన సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఇది CRISIL, CIBIL, American Express వంటి క్రెడిట్ బ్యూరోలకు వరస్తుంది. 

తిరస్కరిస్తే కారణాలు తెలపాల్సిందే..

క్రెడిట్ స్కోర్‌కు సంబంధించి కస్టమర్ల అభ్యర్థను కంపెనీలు తిరస్కరిస్తే.. అందుకు గల కారణాలను క్రెడిట్ సంస్థలు స్పష్టంగా వివరించాలని ఆర్‌బీఐ తెలిపింది. ఖాతాదారుడు తన క్లెయిమ్‌ ఎందుకు తిరస్కరించారన్న విషయాన్ని తెలుసుకోవడంతో పాటు సిబిల్‌ స్కోర్‌ను ఎలా మెరుగుపరుచుకోవాలన్న విషయం తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ మొత్తం రుణ ప్రక్రియ పాదర్శకంగా ఉండాలని ఆర్బీఐ ఆదేశించింది. 

ఏడాదికి ఒకసారి ఉచితంగా.. 

క్రెడిట్‌ సంస్థలు ఖాతాదారుల పూర్తి క్రెడిట్ నివేదికను ఏడాదికి ఒకసారి ఉచితంగా అందించాలని రిజర్వ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ ఇండియా తెలిపింది. రుణాలు అందించే సంస్థలన్నీ సిబిల్‌ చేసుకునే సౌకర్యాన్ని తమ వెబ్‌సైట్‌లో ఈ సౌకర్యాన్ని అందించాలి. ఇది కస్టమర్‌లు తమ పూర్తి క్రెడిట్ హిస్టరీతో పాటు సిబిల్‌ స్కోర్‌ని సంవత్సరానికి ఒకసారి చూసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. 

నోడల్‌ అధికారులను నియమించాలి..

రుణాలు అందించే సంస్థలు కస్టమర్లకు ఎస్‌ఎమ్‌ఎస్‌ లేదా ఇమెయిల్‌ ద్వారా సమాచారాన్ని అందించాలి. ఇందుకు సంబంధించి బ్యాంకులు, రుణ సంస్థలు నోడల్‌ అధికారులను నియమించాలని ఆర్బీఐ ఆదేశించింది.

కస్టమర్ల క్రెడిట్ స్కోర్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి నోడల్ అధికారులు సహాయం చేస్తారు. ఒకవేళ క్రెడిట్ రిఫరెన్స్ ఏజెన్సీ కస్టమర్ ఫిర్యాదును 30 రోజుల్లోగా పరిష్కరించకపోతే, అతను రోజుకు రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

click me!