కొత్త రికార్డు స్థాయికి బంగారం ధరలు...10 గ్రాములకి ఎంతంటే ?

By Sandra Ashok KumarFirst Published Mar 6, 2020, 2:25 PM IST
Highlights

నిన్న మల్టీకమోడిటీ మార్కెట్లో 200 రూపాయిలు పెరిగిన బంగారం ధర నేడు  ఏకంగా రూ. 900 ఎగిసింది.  దీంతో 10 గ్రాముల పసిడి రూ.44,468.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

భారతదేశంలో బంగారం ధరలు నేడు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రూపాయి విలువ బలహీనపడటం, అధిక ప్రపంచ రేట్లు భారతదేశంలో బంగారు రేట్లను కొత్త గరిష్ట స్థాయికి పెంచాయి.

ప్రపంచ దేశాల్లో  కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో ఇన్వెస్టర్లంతా రక్షణాత్మక పెట్టుబడుల ప్రవాహం పుంజుకుంటోంది. దీనికి తోడు దేశీయంగా యస్‌ బ్యాంక్‌ సంక్షోభంతో బంగారం ధర  శుక్రవారం భారీగా పెరిగింది.

also read టాటా సన్స్ బ్యాంక్ అక్కౌంట్ నుండి 200 కోట్లు హ్యాక్...

 నిన్న మల్టీకమోడిటీ మార్కెట్లో 200 రూపాయిలు పెరిగిన బంగారం ధర నేడు  ఏకంగా రూ. 900 ఎగిసింది. ఎం‌సి‌ఎక్స్ లో బంగారు 10 గ్రాములకి 44,349 వద్దకు చేరింది దీంతో ఎంసీఎక్స్‌లో బంగారం ధర అల్‌టైమ్‌ హై గరిష్టాన్ని నమోదు చేసింది.

గత రెండు రోజులుగా బంగారం ధరలు వెయ్యి రూపాయలకు పైగా పెరగడం విశేషం. భారతదేశంలో డాలర్ విలువ బంగారం ధరను పెంచుతూ రూపాయి నేడు అమెరికా డాలర్‌తో పోలిస్తే 74 స్థాయిలకు మించి పడిపోయింది.

also read వచ్చే ఐదేళ్లలో రెట్టింపు కానున్న సంపన్నులు...దాదాపు 219 కోట్లు...

యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించడం, కరోనావైరస్ వ్యాప్తి, యుఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి  క్షీణించడం వంటివి బంగారం ధరలు బాగా పెరగడానికి కారణమని అబాన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ బన్సాల్ పేర్కొన్నారు.

బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని ఎస్‌ఎంసి గ్లోబల్ ఒక నోట్‌లో పేర్కొంది.     

click me!