అంగవైకల్యాన్ని జయించి దేశంలోనే ఏకైక మహిళాగా ఎదిగి...

By Sandra Ashok Kumar  |  First Published Mar 6, 2020, 1:01 PM IST

36 ఏళ్ళ వయసులో రాధిక గుప్తా భారతదేశపు మొట్టమొదటి దేశీయ హెడ్జ్ ఫండ్‌ను ఏర్పాటు చేసి, దేశంలోనే ఏకైక మహిళా అధిపతి అయ్యారు.
 


చాలా మంది మహిళా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఎన్నో విజయాలను జయించడం గురించి కథలు వినే ఉంటారు. కానీ రాధిక గుప్తా అలా కాదు తనకు అంగవైకల్యం ఉన్నప్పటికి  ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా  గొప్ప మహిలగా ఎదిగింది.

 రాధిక గుప్తా పుట్టినప్పటి నుంచి తనకు ఒక సమస్య ఉండేది. ఆమెకి మెడలు శాశ్వతంగ వంపుతో ఉంటుంది. ఈ అంగవైకల్యం వల్ల కొన్ని సార్లు తన ఆత్మగౌరవంపై ప్రభావం చూపింది. కానీ ఇప్పుడు ఆమె భిన్నంగా పనులు చేయడానికి గొప్ప ప్రేరణగా మారింది.
 

Latest Videos

undefined

also read వచ్చే ఐదేళ్లలో రెట్టింపు కానున్న సంపన్నులు...దాదాపు 219 కోట్లు...

36 ఏళ్ళ వయసులో రాధిక గుప్తా భారతదేశపు మొట్టమొదటి దేశీయ హెడ్జ్ ఫండ్‌ను ఏర్పాటు చేసి, దేశంలోనే ఏకైక మహిళా అధిపతి అయ్యారు.

 రాధిక గుప్తా తాజాగా  కార్పొరేట్ రుణాల కోసం భారతదేశంలో మొట్టమొదటి ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్‌ను డిసెంబర్‌లో ప్రారంభించింది. ఎడెల్విస్ అసెట్ మేనేజ్‌మెంట్ క్లయింట్ ఆస్తులను 2025 నాటికి సుమారు 4 బిలియన్ డాలర్ల నుండి 40 బిలియన్ డాలర్లకు పెంచాలనేదే ఆమె చిరకాల ఆశయం.

also read యెస్ బ్యాంక్ దివాళా...? ఖాతాదారుల ఆందోళన....

రాధిక గుప్తా తన జీవితంలో జరిగిన ఒడిదొడుకుల గురించి చెప్తూ ఆమె పుట్టినప్పుడు ఎదురుకొన్న ఎన్నో సమస్యలను తెలిపింది. పాకిస్తాన్ లో జన్మించిన ఆమె భారత దౌత్య తండ్రిని ఉద్యోగరీత్యా ఎక్కడికి వెళ్ళిన రాధికా గుప్తా కూడా తన తండ్రి పనిచేస్తున్నా దగ్గరే ఉండేది అలా తన బాల్యాన్ని గడిపారు.

ప్రముఖులు, గొప్ప గొప్ప వారి కుమార్తెలతో నైజీరియాలోని ఒక అంతర్జాతీయ పాఠశాలలో చదువుకోవడం నుండి అమెరికాలో ఉన్న గొప్ప అమ్మాయిల  వరకు, కొత్త భాషలు, సంస్కృతులు చూసింది తెలుసుకుంది.  మొదట, ఆమెకు ఉన్న అంగవైకల్యం గురించి మొహమాటంగా ఉన్న తరువాత తనకు ఉన్న అంగవైకల్యాన్ని జయించి ఆమె తన ప్రత్యేకతను చాటుకుంది.

click me!