తెలుగు రాష్ట్రాల్లో ఇక ‘నీళ్లు లేకుండానే స్నానం’!

By rajashekhar garrepallyFirst Published Apr 25, 2019, 12:32 PM IST
Highlights

బయోటెక్నాలజీ స్టార్ట్ అప్ సంస్థ క్లెన్‌స్టా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మార్కెట్లో తమ ఉత్పత్తులను విడుదల చేసింది. నీటి అవసరం లేకుండా స్నానం చేసే ఉత్పత్తులపై ఈ సంస్థ ఎక్కువగా దృష్టి సారించింది. 

హైదరాబాద్: బయోటెక్నాలజీ స్టార్ట్ అప్ సంస్థ క్లెన్‌స్టా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మార్కెట్లో తమ ఉత్పత్తులను విడుదల చేసింది. నీటి అవసరం లేకుండా స్నానం చేసే ఉత్పత్తులపై ఈ సంస్థ ఎక్కువగా దృష్టి సారించింది. 

క్లెన్‌స్టా.. ఎక్కువగా ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తయారు చేస్తోంది. నీటి అవసరం లేని స్నానం, షాంపూలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉందని క్లెన్‌స్టా వ్యవస్థాపకుడు, సీఈఓ పునీత్ గుప్తా ఈ సందర్భంగా తెలిపారు.

తమ ఉత్పత్తులను శరీరంపై స్ప్రే చేసుకుని, రుద్ది, తువ్వాలుతో తుడుచుకుంటే సరిపోతుందని ఆయన తెలిపారు. సైనికులు, ఆసుపత్రుల్లో చేరిన వారు ఎక్కువగా ఈ వస్తువులను ఉపయోగిస్తున్నారని వివరించారు. 

అంతేగాక, నడవలేని స్థితిలో ఉండే వృద్ధులకు తమ ఉత్పత్తులు ఎంతగానే ఉపయోగపడతాయని తెలిపారు. 100 మిల్లిలీటర్ల పరిమాణంలో ఉన్న ఈ ఉత్పత్తితో 7-8సార్లు నీళ్లు లేకుండా స్నానం చేయవచ్చని తెలిపారు. వీటి ధర రూ. 549, రూ. 499 అని చెప్పారు.

భారతదేశంతోపాటు బ్రిటన్, సౌదీ అరేబియా, కువైట్ లాంటి దేశాలకూ ఎగుమతి చేస్తున్నట్లు పునీత్ గుప్తా తెలిపారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో రూ. 35కోట్లతో ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నామని, దీంతో 100 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.

ఏడాదికి 3 నుంచి 5 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి ఉత్పత్తిని ప్రారంభిస్తామని చెప్పారు. రోజుకు రెండు లక్షల 2ఎంఎల్ బాటిళ్లు ఉత్పత్తి చేయనున్నట్లు హైదరాబాద్‌లో మీడియాకు తెలిపారు.

ఆన్‌లైన్‌లోనూ తమ ఉత్పత్తులు లభిస్తున్నాయని పునీత్ గుప్తా తెలిపారు.  త్వరలోనే నీటి అవసరం లేని టూత్‌పేస్టు, దోమలు కుట్టకుండా నిరోధించే బాడీబాత్‌ ఉత్పత్తులను కూడా విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు.

 

మరిన్ని వార్తలు చదవండి: 

ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ ఇల్లు స్మార్ట్ ‘అలెక్సా’నే!

తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి రెక్కల్లేని ఫ్యాన్లు: ప్రత్యేకతలివే

click me!