జస్ట్ 23 రోజులు.. దేశంలో మొత్తం ఎన్ని పెళ్లిళ్లు, ఎంత బిజినెస్ జరగనుందంటే..: CAIT రిపోర్ట్

By asianet news telugu  |  First Published Nov 21, 2023, 8:22 PM IST

అమ్మకాలు దీపావళి వేడుకల కారణంగా మళ్లీ సర్వే నిర్వహించాల్సి వచ్చిందని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. అదే సమయంలో ద్రవ్యోల్బణం వివాహ వ్యయాన్ని ప్రభావితం చేస్తుందనే దాన్ని కూడా అతను తిరస్కరించాడు. 


దేశంలో పండుగల సీజన్ ముగియనున్న తరుణంలో పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం కానుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఈ పెళ్లిళ్ల సీజన్‌లో 38 లక్షల వివాహాల ద్వారా రూ.4.74 లక్షల కోట్ల బిజినెస్ జరగవచ్చని  అంచనా వేస్తోంది, ఈ సంఖ్యా మునుపెన్నడూ లేనిది. నవంబర్ 23 నుండి డిసెంబర్ 15 2023 మధ్య కేవలం 23 రోజుల్లో దేశంలో 38 లక్షల వివాహాలు జరుగుతాయని CAIT అంచనా వేసింది. ఆ తర్వాతే ఈ పూర్తి లెక్కలు చేస్తారు.

ఈ 38 లక్షల వివాహాల ద్వారా రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని గత నెలలో CAIT అంచనా వేసింది. గతేడాది ఇదే కాలంలో దాదాపు 32 లక్షల వివాహాలు జరిగాయి. దింతో  మొత్తం రూ.3.75 లక్షల కోట్ల లావాదేవీ జరిగాయి. ఈ 23 రోజుల్లో ఢిల్లీలోనే దాదాపు 3.5 లక్షల వివాహాలు జరగనున్నాయి, దీని వల్ల దాదాపు రూ.1 లక్ష కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది.

Latest Videos

అమ్మకాలు దీపావళి వేడుకల కారణంగా మళ్లీ సర్వే నిర్వహించాల్సి వచ్చిందని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. అదే సమయంలో ద్రవ్యోల్బణం వివాహ వ్యయాన్ని ప్రభావితం చేస్తుందనే దాన్ని కూడా అతను తిరస్కరించాడు. ద్రవ్యోల్బణం పెళ్లిళ్ల సీజన్‌పై ప్రభావం చూపదు, ఎందుకంటే ప్రజలు తమ ఇష్టానుసారంగా ఖర్చు చేస్తారు. పెళ్లిళ్ల షాపింగ్‌ను తగ్గించడానికి పెద్దగా అవకాశం లేదు. ద్రవ్యోల్బణం కేవలం పండుగ షాపింగ్‌పై మాత్రమే ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.

CAIT, స్పిరిట్యువల్  అండ్  వేదిక్ కమిటీ  కమిటీ చైర్మన్ ఆచార్య దుర్గేష్ తారే ప్రకారం, నవంబర్ 23, 24, 27, 28 ఇంకా  29 వివాహాలకు అనుకూలమైన తేదీలు, ఆ తర్వాత డిసెంబర్ 3, 4, 7, 8, 9 అండ్ 15.  తారువాత  వివాహ సీజన్  2024 జనవరి మధ్యలో ప్రారంభమవుతుంది  అలాగే ఆ  సంవత్సరం జూలై వరకు కొనసాగుతుందని చెప్పాడు.

రాబోయే పండుగలు, పెళ్లిళ్ల సీజన్లలో ఆభరణాలు, చీరలు, ఫర్నీచర్, రెడీమేడ్ దుస్తులు, పాదరక్షలు, ఇతర ఉపకరణాలకు డిమాండ్ పెరుగుతుందని సీఏఐటీ పేర్కొంది.

సర్వే ఎలా జరిగింది?: 
సర్వే మెథడాలజీ గురించి కూడా ప్రవీణ్ ఖండేల్వాల్ తెలియజేసారు, మా సంస్థ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలుగా పనిచేసే 30 నగరాలను గుర్తించింది. CAIT యాక్టీవ్ గా ఉన్న 600 ప్లస్ జిల్లాల నుండి ఇన్‌పుట్‌ల కోసం ఇంటిగ్రేటెడ్ డేటా దీనికి జోడించబడింది. సర్వే వినియోగదారులకు అనుకూలమైన ఇంకా  అనుకూలత లేని పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది అలాగే  గొప్ప వ్యాపారాన్ని సృష్టించే అంశాలను లిస్ట్  చేస్తుంది.

స్థానిక వ్యాపార సంస్థలు వినియోగదారుల నుంచి ఇన్‌పుట్‌ను సేకరించాయని చెప్పారు. గత ఏడాది కూడా మా డేటా సరైనదేనని, ఈ సర్వే గ్రౌండ్ డేటా ఆధారంగా జరిగిందని, టేబుల్ టాప్ అనాలిసిస్ కాదని ఆయన అన్నారు.

click me!