
బారత్‌లో గృహ వినియోగ కీటక నాశినుల సురక్షిత వాడకాన్ని ప్రోత్సహించే లాభాపేక్ష పరిశ్రమ సంస్థ హోమ్ ఇన్సెక్ట్ కంట్రోల్ అసోసియేషన్ (HICA), జాతీయ డెంగ్యూ దినోత్సవం (మే 16) సందర్భంగా ఒక సమగ్ర ప్రజారోగ్య అధ్యయనాన్ని విడుదల చేసింది. కంటార్ అనే మార్కెట్ రీసెర్చ్ సంస్థ ద్వారా నిర్వహించిన ఈ పరిశోధన ప్రకారం.. డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వచ్చే వ్యాధులను నివారించడానికి వాడే అక్రమ దోమల నివారణ అగర్బత్తీలే, ఆ వ్యాధుల కంటే కూడా పెద్దవిగా, తక్షణ ఆరోగ్య ముప్పుగా మారుతున్నాయని వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న 95 శాతం కుటుంబాలలో గత ఏడాదిలో మలేరియా లేదా డెంగ్యూ వంటి వ్యాధులు ఏవీ నమోదు కానప్పటికీ, అనుమతి లేని రసాయనాలతో కూడిన అక్రమ దోమల అగర్బత్తీలను 70 శాతం మంది వైద్యులు ప్రధాన శ్వాసకోశ ముప్పుగా వర్గీకరించారు. వీటివల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు సిగరెట్ పొగతో సమానమని 67 శాతం మంది వైద్యులు అభిప్రాయపడ్డారు.
ఈ సర్వేను ఇటీవల 12 నగరాల్లో 1264 కుటుంబాలు, 405 మంది వైద్యులతో నిర్వహించారు. ఈ వైద్యులలో పల్మనాలజిస్టులు, పీడియాట్రిషియన్లు, జనరల్ ఫిజిషియన్లతో పాటు గైనకాలజిస్టులు ఉన్నారు. అక్రమ దోమల అగర్బత్తీలను విస్తృతంగా వాడటం వల్ల భారతీయ ఇళ్లలో పెరుగుతున్న ఆరోగ్య సంక్షోభాన్ని ఈ సర్వే హైలైట్ చేస్తోంది.
భారతదేశంలో ఈ సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దేశవ్యాప్త దోమల నివారణ అగర్బత్తీల మార్కెట్ విలువ సుమారు రూ. 2000 కోట్లు ఉండగా, అందులో ఏకంగా 85 శాతం వాటా అక్రమ లేదా నియంత్రణ లేని సంస్థలదే ఉంది. ఈ ఉత్పత్తులకు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకపోవడమే కాకుండా, తప్పనిసరిగా ఉండాల్సిన సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ రిజిస్ట్రేషన్ (CIR) లేబుల్ గానీ, వాటి తయారీలో వాడే రసాయనాలు వివరాలు గానీ ఉండవు. సాధారణంగా ఇవి కంపఫర్ట్ స్టీప్‌వెల్, రిలాక్స్, సన్ రిలాక్స్, శుభనిద్ర, హంటింగ్ టైగర్, హై వోల్టేజ్, హ్యాపీ నైట్, డెంగ్యూ కిల్లర్, హై పవర్ వంటి పేర్లతో విక్రయిస్తున్నారు. నియంత్రణ సంస్థల అనుమతులు లేనప్పటికీ, దాదాపు 59 శాతం భారతీయ కుటుంబాలు ఇటువంటి ఉత్పత్తులనే వాడుతున్నాయని, అందులో సగం మంది గత మూడేళ్లకు పైగా ప్రతిరోజు వీటిని ఉపయోగిస్తున్నారని సర్వేలో వెల్లడైంది.
ఈ సందర్భంగా హోమ్ ఇన్సెక్ట్ కంట్రోల్ అసోసియేషన్ (HICA) కార్యదర్శితో పాటు డైరెక్టర్ జయంత్ దేశ్‌పాండే మాట్లాడుతూ.. స్థానిక దుకాణాలు, కెమిస్ట్ అవుట్‌లెట్లలో విక్రయించే దోమల అగర్బత్తీలలో చాలా వరకు పరీక్షించబడినవి. చట్టవిరుద్ధమైనవి, వీటికి తప్పనిసరిగా ఉండాల్సిన సీఐఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదని పేర్కొన్నారు. వినియోగదారులు సీఐఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను స్పష్టంగా ప్రదర్శించే ఉత్పత్తుల కోసం చూడాలని, అస్పష్టమైన వాదనాలు చేసే లేదా నియంత్రణ సంస్థల వెల్లడి లేని ఉత్పత్తులకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఈ అగర్బత్తీల పొగకు ఎక్కువ కాలం గురికావడం వల్ల ఇళ్లలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అక్రమ దోమల అగర్బత్తీలను క్రమంతప్పకుండా వాడటం వల్ల కుటుంబాల ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతున్నాయని 84 శాతం మంది వైద్యులు భావిస్తున్నారు. మరోవైపు వినియోగదారుల అవగాహనకు.. వాస్తవానికి మద్య పెద్ద వ్యత్యాసం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కెమిస్ట్ దుకాణాల్లో దొరుకుతున్నాయి కాబట్టి ఆ ఉత్పత్తులు సురక్షితమని 48 శాతం మంది యూజర్లు భావిస్తుండగా.. ఇటువంటి నమ్మకం చాలా ప్రమాదకరమని 56 శాతం మంది వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే హెర్బల్ లేదా సిట్రోనెల్లా ఆధారిత అగర్బత్తీలు సురక్షితమని 50 శాతం మంది వినియోగదారులు నమ్ముతుంటే.. తప్పుదోవ పట్టించే వాదనలు, ఎటువంటి నియంత్రణ లేకపోవడం వల్ల ఇటువంటి ఉత్పత్తులతో మరిన్ని ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయని 66 శాతం మంది వైద్యులు స్పస్టం చేస్తున్నారు. ఈ సర్వే అవగాహన లోపానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని హైలైట్ చేస్తోంది. ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ, సురక్షితమైన, ప్రభుత్వం ఆమోదించిన ప్రత్యామ్నాయాల గురించి చాలా మంది కుటుంబాలకు తెలియడం లేదని దాదాపు 55 శాతం మంది వైద్యులు గమనించారు. దీనివల్ల ప్రజలు రిస్క్ అని తెలిసినా సులభంగా లభించే అక్రమ దోమల అగర్బత్తీలపైనే ఆధారపడుతున్నారని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.
కంటార్ రిపోర్టులోని అంశాలపై ఎస్.ఎల్. రహేజా హాస్పిటల్ (మహిమ్ - ఎ ఫోర్టిస్ అసోసియేట్) క్రిటికల్ కేర్ డైరెక్టర్ డాక్టర్ సంజిత్ శశీధరన్ స్పందిస్తూ.. డెంగ్యూ వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందడానికి దోమల నివారణ మందులు అవసరమే అయినప్పటికీ, దోమల అగర్బత్తీలతో సహా ఈ ఉత్పత్తుల నుంచి వెలువడే పొగకు నిరంతరం గురికాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. మార్కెట్‌లో విక్రయించే కొన్ని దోమల నివారణ మందులు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉండకపోవడమే అసలు సమస్య అని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి కొన్ని ఉత్పత్తులలో పైరెథ్రాయిడ్స్, ఆర్గానో ఫాస్ఫేట్లు, భార లోహాలతో పాటు శ్వాసనాళాన్ని ఇబ్బంది పెట్టే ఇతర సమ్మేళనాలు వంటి విషపూరిత పదార్థాలు ఉండవచ్చని వివరించారు. ఇంట్లో వీటిని నిరంతరం ఉపయోగించే వారిలో ఈ అక్రమ దోమల అగర్బత్తీల వల్ల వచ్చే శ్వాసకోశ సమస్యలతో పాటు అలర్జీలు ఇప్పుడు సర్వసాధారణంగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కంటార్ రిపోర్టులోని అంశాలపై ఎస్.ఎల్ రహేజా హాస్పిటల్ (మహిమ్ - ఎ ఫోర్టిస్ అసోసియేట్), క్రిటికల్ కేర్ డైరెక్టర్, డాక్టర్ సంజిత్ శశీధరన్ స్పందిస్తూ.. డెంగ్యూ జ్వరం వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందడానికి దోమల నివారణ ముందులు కూడా చాలా ముఖ్యమైనవి అయినప్పటికీ, దోమల అగర్బత్తీలతో సహా ఈ ఉత్పత్తుల నుంచి వెలువడే పొగకు నిరంతరం గురికాకుండా జాగ్రత్త వహించాలి. మార్కెట్‌లో విక్రయించే కొన్ని దోమల నివారణ మందులు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉండకపోవడమే అసలు సమస్య. ఎందుకంటే కొన్ని ఉత్పత్తులలో పైరెథ్రాయిడ్స్, ఆర్గానోఫాస్పేట్లు, భార లోహాలతో పాటు శ్వాస నాళాన్ని ఇబ్బంది పెట్టే ఇతర సమ్మేళనాలు వంటి విషపూరిత పదార్థాలు ఉండవచ్చు. ఇంట్లో వీటిని నిరంతరం ఉపయోగించే వారిలో ఈ అక్రమ దోమల అగర్బత్తీల వల్ల వచ్చే శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు ఇప్పుడు సర్వసాధారణంగా మారుతున్నాయి.
చిన్నారులు, వృద్ధులు, ఆస్తమా రోగులు, సీఓపీడీ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ ప్రమాదకర సమూహాల జాబితాలో ఉన్నారు. ఈ పొగను పీల్చడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు మరింత తీవ్రమవుతాయి. దీనివల్ల శ్వాసనాళాల్లో చికాకు కలిగి నిరంతరం దగ్గు, పిల్లికూతలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంతులు తలెత్తుతాయి. చౌకైన, సురక్షితమైన పరిష్కారమని నమ్మే ఇలాంటి ఉత్పత్తులు, నిరంతరం వాడటం వల్ల నిజానికి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి. ప్రజలు అధికారలుతో ఆమోదం పొంది, ఇళ్ల లోపల వాడటానికి సురక్షితమని పరీక్షల్లో నిరూపితమైన దోమల నివారణ ముందులను మాత్రమే వాడటం ఉత్తమం అని పేర్కొన్నారు.
వినియోగదారుల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, వారు సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఈ ఫలితాలు నొక్కి చెబుతున్నాయి. మన దైనందిన దోమల రక్షణ అనేది దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకూడదు అంటే నియంత్రణ లేని అక్రమ ఉత్పత్తులపై కఠినమైన నిఘా ఉండాలని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.
హోమ్ ఇన్సెక్ట్ కంట్రోల్ అసోసియేషన్ (HICA) 1995లో ముంబైలో స్థాపించిన ప్రముఖ సంస్థ. దేశీయ గృహ కీటకనాశక (హోమ్ ఇన్‌సెక్టిసైడ్స్) రంగం అభివృద్ధికి ప్రోత్సాహం అందించడం, ఈ రంగానికి చెందిన సభ్యుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, పర్యావరణ భద్రతకు తోడ్పడడం, అలాగే ఇళ్లలో ఉపయోగించే కీటకనాశకాలను ఆరోగ్యకరంగా, సురక్షితంగా, సరైన విధంగా వినియోగించడంపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. దీని ద్వారా కీటకాల రహిత, ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించేందుకు HICA కృషి చేస్తోంది.
పూర్తి వివరాల కోసంఇక్కడ క్లిక్ చేయండి.