ఏడాది మధ్యలో టాటా అల్ర్టోజ్‌ విడుదల

By rajesh yFirst Published Feb 26, 2019, 10:42 AM IST
Highlights

టాటా మోటార్స్ తన కెరీర్‌లో వినూత్నమైన మోడల్ హ్యాచ్ బ్యాక్ కారును మార్కెట్లోకి తీసుకు రానున్నది. గతంలో 45ఎక్స్ మోడల్ కారు పేరుతో మార్కెట్లో ఆవిష్కరించిన టాటా మోటార్స్.. జెనీవాలో జరిగే మోటార్స్ షోలో ‘ఆల్రోజ్’ పేరిట ప్రదర్శించ బోతున్నది. హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్‌ను ‘ఆల్రోజ్’ పునర్నిర్వచిస్తుందని టాటా మోటార్స్ ప్యాసింజర్స్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ అధ్యక్షుడు మయాంక్ పరీఖ్ పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: వచ్చే నెల ఏడో తేదీ నుంచి 10 రోజుల పాటు జెనీవాలో సాగే ‘మోటార్ షో’ టాటా మోటార్స్ సంస్థకు ఎంతో కీలకం. సంప్రదాయంగా టాటా మోటార్స్ తన కీలక మోడల్ కార్లను ‘మోటార్స్’, ‘ఆటోమొబైల్స్’ ఎక్స్ పోల్లో ఆవిష్కరిస్తుంది. అలాగే జెనీవా మోటార్స్ షో కూడా టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్ ‘టాటా 45ఎక్స్’ అలియాస్ ‘ఆల్రోజ్’ మోడల్ కారు ఆవిష్కరణకు వేదిక కానున్నది. 

స్పెషల్ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న టాటా 45ఎక్స్ మోడల్ కారు 2018లో గ్రేటర్ నోయిడాలో జరిగిన మోటార్స్ ఎక్స్‌పో దగ్గర నుంచి పలుసార్లు భారతీయ రోడ్లపై పరీక్షించింది టాటా మోటార్స్. టాటా 45 ఎక్స్ మోడల్ కారు ప్రత్యేకించి టెయిల్ లాంప్స్, 16 అంగుళాల వీల్స్, రాప్ రౌండ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్, ఫ్రంట్ బంపర్ తదితర ఫీచర్లు ఇందులో చేర్చారు. 

టాటా మోటార్స్ ఉత్పత్తుల్లో టాటా 45 ఎక్స్ అలియాస్ ‘ఆల్రోజ్’ మోడల్ కారు తొలి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారు. ఇది ప్రత్యర్తి సంస్తలు మారుతి సుజుకికి చెందిన బాలెనో, హ్యుండాయ్ ఐ20, వోక్స్ వ్యాగన్ పోలో మోడల్ కార్లతో పోటీ పడనున్నది. తాజాగా ఆల్ఫా ఫాట్ పామ్‌పై టాటా 45ఎక్స్ మోడల్ కారు రూపుదిద్దుకుంటున్నది. 

1.2 లీటర్లు, త్రీ సిలిండర్, టర్బో చార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ లేదా 1.5 లీటర్ల 4- సిలిండర్ టర్బో చార్జ్‌డ్ డీజిల్ ఇంజిన్ ఈ కారులో ఉన్నాయి. ప్రారంభ దశలో టాటా 45 ఎక్స్ మోడల్ కారు మాన్యువల్ ట్రాన్స్ మిషన్ మోడ్‌లో రూపొందించారు. 

వీటి ధర రూ.5.45 లక్షల నుంచి రూ.9.34 లక్షల వరకు ఉంది. తాము తీసుకురాబోయే మోడల్‌ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌ను పునర్‌ నిర్వచిస్తుందని టాటా మోటార్స్‌ ప్యాసెంజర్‌ వెహికిల్‌ బిజినెస్‌ యూనిట్ ప్రెసిడెంట్‌  మయాంక్‌ పరీక్‌ తెలిపారు.

click me!