2.74 సెకన్లలో 100 కి.మీ స్పీడ్: సరికొత్త స్పోర్ట్స్‌ బైక్‌ స్పెషాలిటీ

By Sandra Ashok Kumar  |  First Published Dec 14, 2019, 11:24 AM IST

జపాన్ ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్ ఇండియా భారతదేశ విపణిలోకి సుజుకి హయబుసా అనే స్పోర్ట్స్ బైక్‌ను ఆవిష్కరించింది. కేవలం 2.74 సెకన్లలోనే 100 కి.మీ. వేగంతో దూసుకెళ్లే ఈ మోటారు బైక్ ధర రూ.13.75 లక్షలుగా నిర్ణయించారు.


న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా (ఎస్‌ఎంఐపీఎల్) సరికొత్త 2020 సుజుకీ హయబుసా స్సోర్ట్స్‌ బైక్‌ని భారత విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 13.74 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. 

also read  5.9 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగం...ధర ఎంతంటే ?

Latest Videos

undefined

ఈ హయబుసా స్పోర్ట్స్‌ బైక్‌ మెటాలిక్‌ థండర్‌ గ్రే, కాండీ డేరింగ్‌ రెడ్‌ అనే రెండు రంగుల్లో లభించనుంది. వీటికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా తక్కువ సంఖ్యలో తయారు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో సరికొత్త గ్రాఫిక్స్‌తోపాటు ముందు బ్రేక్‌ కాలిపర్‌ను ఆధునీకీకరించారు.హయబుసా స్పోర్ట్స్‌ బైక్‌‌లో 1340సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 9500 ఆర్‌పీఎం వద్ద 197బీహెచ్‌పీ శక్తిని, 7200 ఆర్‌పీఎం వద్ద 155 ఎన్‌ఎమ్‌ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 

కేవలం 2.74 సెకండ్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని ఈ హయబుసా స్పోర్ట్స్‌ బైక్‌ అందుకుంటుంది. ఈ బైక్‌ అత్యధిక వేగం 299 కిలోమీటర్లు. ‘‘రెండు దశాబ్దాలుగా సుజుకీ హయబుసా ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్‌బైక్‌ అభిమానుల మొదటి ఎంపికగా ఉంది. భారత్‌లో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. 

also read డీజిల్ ఇంజిన్ కార్ల ఉత్పత్తిపై ‘మారుతి’ పునరాలోచన

‘సుజుకీ మోటార్‌సైకిల్‌ నుంచి భారత్‌లో తయారు చేసిన తొలి స్సోర్ట్స్‌ బైక్‌ ఇదే. మరోసారి 2020 సరికొత్త హయబుసా మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయడం పట్ల ఎంతో ఉత్పాహంతో ఉన్నాం’ అని సుజుకీ మోటార్‌ సైకిల్ ఇండియా ఎండీ కియోచిరో హైరో అన్నారు. 2021నాటికి పూర్తి మార్పులతో సరికొత్త హంగులతో కూడిన హయబుసా బైక్ పూర్తిగా అందుబాటులోకి తేనున్నారు.
 

click me!