యమహా ఫస్ట్ 'బ్లూ స్క్వేర్' ప్రీమియం కాన్సెప్ట్ షోరూమ్‌...

By Sandra Ashok Kumar  |  First Published Dec 13, 2019, 1:45 PM IST

యమహా కంపెనీ మొట్టమొదటి  బ్లూ స్క్వేర్ అవుట్‌లెట్ చెన్నైలో ప్రారంభించారు. రిటైల్ టీ బ్రాండ్ల ప్రీమియం శ్రేణి మోటారుసైకిల్, స్కూటర్లను రిటైల్ చేస్తుంది. ఇలాంటి మరో 100 అవుట్‌లెట్లను 2020లో  ప్రారంభించాలని కంపెనీ ఆలోచిస్తుంది.


యమహా మోటర్స్ ఇండియా  భారతదేశంలో  కొత్త 'బ్లూ స్క్వేర్' కాన్సెప్ట్ షోరూమ్ ప్రారంభించింది. యమాహా  బ్రాండ్  'ది కాల్ ఆఫ్ ది బ్లూ' ప్రచారంలో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ షో రూమ్ చెన్నైలో ప్రారంభమైంది.మొదటి అవుట్లెట్ సుమారు 4000 చదరపు అడుగులు విస్తారం ఉంటుంది. యమాహా కంపెనీ ఈ అవుట్లెట్ లో యమాహా సూపర్ బైక్‌లతో సహా అన్నీ ప్రీమియం మోటార్‌సైకిళ్ళు, స్కూటర్లను రిటైల్ చేస్తుంది.

also read డీజిల్ ఇంజిన్ కార్ల ఉత్పత్తిపై ‘మారుతి’ పునరాలోచన
 
ఈ అవుట్లెట్ ప్రారంభోత్సవంలో యమహా మోటార్ ఇండియా చైర్మన్ మోటోఫుమి షితారా మాట్లాడుతూ, "మా వినియోగదారులకు వారు అందించిన ప్రోత్సాహానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ అవుట్లెట్ స్పొర్ట్స్ కస్టమర్ అనుభవాలలో ప్రత్యేకంగా  నిలుస్తుంది. మా కస్టమర్లు కూడా దీనిని ఇష్టపడతారని మేము ఆశిస్తున్నాము.

Latest Videos

undefined


 యమహా  "బ్లూ స్క్వేర్" యమహా రేసింగ్ స్ఫూర్తిని కలిపిస్తుంది, ఇక్కడ స్టైలిష్, స్పోర్టి ద్విచక్ర వాహనాలు ఇంకా అసెసోరీస్,  దుస్తులు, స్పేర్ పార్ట్స్ అందించబడతాయి. "బ్లూ స్క్వేర్" షోరూమ్‌లు కస్టమర్ రికార్డులను డిజిటల్‌గా నిర్వహిస్తాయి. అయితే కొనుగోలుదారులు వాహన క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా బ్రోచర్‌లను డిజిటల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డీలర్, కస్టమర్ల మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరిచే ఆన్-టైమ్ కమ్యూనికేషన్, వన్-టు-వన్ మార్కెటింగ్‌ను అందించడానికి ఇది సహాయపడుతుందని యమహా తెలిపింది.

also read  మరో రెండు నెలల్లో హీరో మోటోకార్ప్​ 10 కొత్త మోడళ్లు..!

భవిష్యత్తులో మరింత ప్రభావవంతమైన కమ్యూనికేషన్ కోసం ఫేస్-స్కానింగ్ సిస్టమ్స్ మరియు డీలర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని యమహా యోచిస్తోంది. అదనంగా, బ్లూ స్క్వేర్ షోరూమ్‌లు కస్టమర్ల కోసం నిలిపివేయడానికి ఒక కేఫ్‌ను కలిగి ఉంటాయి, బ్లూ స్ట్రీక్‌లతో పాటు కస్టమర్ ప్రశ్నలను వేగవంతం చేయడానికి మరియు టూరింగ్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తుంది. జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 2020 లో సుమారు 100 బ్లూ స్క్వేర్ అవుట్‌లెట్లను తెరవాలని యోచిస్తోంది
 

click me!