గగన తలంలోకి భారత్ జీవఇంధన తొలివిమానం

By sivanagaprasad KodatiFirst Published Aug 27, 2018, 2:48 PM IST
Highlights

విమానయానంలో భారత్ మరోమైలు రాయి దాటింది. జీవ ఇంధనంతో నడిచే విమానాన్నితొలిసారిగా ప్రయోగించి విజయవంతమైంది. ఇప్పటి వరకు అమెరికా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే జీవ ఇంధనంతో నడిచే కమర్షియల్‌ విమానాలను నడుపుతున్నాయి. భారత్ కూడా వాటి సరసన చేరబోతుంది

విమానయానంలో భారత్ మరోమైలు రాయి దాటింది. జీవ ఇంధనంతో నడిచే విమానాన్నితొలిసారిగా ప్రయోగించి విజయవంతమైంది. ఇప్పటి వరకు అమెరికా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే జీవ ఇంధనంతో నడిచే కమర్షియల్‌ విమానాలను నడుపుతున్నాయి. భారత్ కూడా వాటి సరసన చేరబోతుంది.

జీవ ఇంధనంతో నడిచే విమానం నేడు గాల్లోకి ఎగిరింది. టర్బైన్‌ ఇంధనానికి బదులుగా జీవ ఇంధనం ఉపయోగించి స్పైస్‌జెట్‌ విమానాన్ని సోమవారం ఉదయం డెహ్రాడూన్‌-ఢిల్లీ మధ్యలో విజయవంతంగా పరీక్షించారు. విపరీతంగా పెరిగిపోతున్న విమాన నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

పునరుత్పాదక వనరులైన వ్యవసాయ వ్యర్థాలు, నాన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌, పారిశ్రామిక, పురపాలక వ్యర్థాల నుంచి జీవ ఇంధనాన్ని రూపొందిస్తారు. జీవ ఇంధనంతో విమానాలు మరింత సమర్థవంతంగా నడవడంతోపాటు విమాన ప్రయాణానికి మరింత స్వచ్ఛతను తీసుకువస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  మరోవైపు టర్బైన్‌ ఇంధనం ఖర్చుతో పోల్చుకుంటే జీవ ఇంధనం చాలా చౌకగా లభించడంతో విమానయాన సంస్థలకు నిర్వహణ ఖర్చు తగ్గనున్నాయి.  

సోమవారం తొలిసారిగా వినియోగించిన జీవ ఇంధనాన్ని డెహ్రాడూన్‌కు చెందిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం సంస్థ 72 సీట్ల సామర్థ్యం ఉన్నఈ స్పైస్‌జెట్‌ విమానాన్ని రూపొందించింది.  ఉదయం ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ జెండా ఊపి జీవ ఇంధన విమానయాన సర్వీసును ప్రారంభించారు విమానానికి కావాల్సిన జీవ ఇంధన తయారీలో ఛత్తీస్‌గఢ్‌లోని 500 కుటుంబాలు భాగస్వామ్యం కావడం విశేషం.
 
మరోవైపు ఢిల్లీలోని టెర్మినల్‌2లో బయో ఫ్యూయల్‌ విమానాన్ని రిసీవ్‌ చేసుకున్నామని పెట్రోలియం శాఖామంత్రి ధరేంద్ర ప్రధాన్‌ ట్వీట్‌ చేశారు. అందులో భాగంగా స్పైస్‌జెట్‌, ఏవియేషన్‌ అధారిటితోపాటు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, డెహ్రాడూన్, ఛత్తీస్‌గఢ్ బయో ఫ్యూయెల్ డెవలప్మెంట్ అథారిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలకు కేంద్రమంత్రి అభినందనలు తెలిపారు. 

ఈ బయో మిషన్‌ను మరింత అభివృద్ధి పరిచేందుకు త్వరలోనే పెట్రోలియం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఒక  కొత్త బయో-ఏటీఎఫ్‌పాలసీ తీసుకురానున్నట్లు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. కార్బన్ ఉద్గారాలను నియంత్రించాలన్న ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు  ఈ చారిత్రాత్మక మైలురాయిని అధిగమించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు నితిన్‌గడ్కరీ, సురేష్‌ ప్రభు, హర్హవర్దన్‌, జయంత్‌ సిన్హా  హాజరయ్యారు.

click me!