ఫ్యూచర్ మొబిలిటీ కోసం రెనాల్డ్ నుంచి 3 విద్యుత్‌ కాన్సెప్ట్‌ కార్లు!

By rajesh yFirst Published May 17, 2019, 10:20 AM IST
Highlights
ఫ్రాన్స్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ ఫ్యూచర్ మొబిలిటీ కోసం మూడు విద్యుత్ కాన్పెప్ట్ మోడల్ కార్లను ఆవిష్కరించింది. వైవా టెక్నాలజీ ఎక్స్ పోలో ప్రదర్శించింది. 
పారిస్‌: ఫ్రెంచి దిగ్గజం రెనాల్డ్ భవిష్యత్‌ రవాణా అవసరాల కోసం మూడు విద్యుత్‌ కాన్సెప్ట్‌ కార్లను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా స్వయంచోదిత విద్యుత్‌ కారు అయిన రెనాల్డ్ జడ్‌ఓఈ క్యాబ్‌తో కార్‌-ఆన్‌-డిమాండ్‌ సేవలను ఇక్కడ జరుగుతున్న వైవా టెక్నాలజీ ప్రదర్శనలో ప్రారంభించింది.

రెనాల్డ్ జడ్‌ఎక్స్‌-ఫ్లెక్స్‌ను తొలిసారిగా గ్రూప్‌ లా పోస్ట్‌తో కలిసి ప్రదర్శించింది. ఇక మూడో కాన్సెప్ట్‌ కారు అయిన రెనాల్డ్ ఈజడ్‌-పీఓడీని సైతం ఇక్కడి ప్రేక్షకులకు చూపింది. 

ఇపుడు ప్రయాణం అన్నది పెద్ద సమస్య కాదు. అన్ని రకాల వాహనాలను చిరకాలం పాటు తయారు చేయాలన్నదే మాకు అత్యంత ముఖ్యమైన విషయం’అని రెనాల్ట్ గ్రూప్‌ సీఈఓ థెర్రీ బొలో పేర్కొన్నారు. భవిష్యత్ రవాణా అవసరాల కోసం పర్యావరణ అనుకూల ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ప్రతిపాదించడం తమ బాధ్యత అని తెలిపారు.  

స్వయంచోదిత విద్యుత్‌ వాహనం రెనాల్ట్ జడ్‌ఓఈ క్యాబ్‌ను క్యాబ్‌ అవసరాల కోసం రూపొందించారు. ఆన్‌-డిమాండ్‌ కారు సేవలను ఇది అందజేయబోతోంది. ప్రయోగాత్మకంగా రూపొందించిన కాంపాక్ట్‌ విద్యుత్ కారు రెనాల్ట్ జడ్ ఎక్స్ -ప్లెక్స్. పట్టణ అవసరాల కోసం దీనిని రూపొందించారు. 

రెండు సీట్లు మాత్రమే ఉండే రెనో ఈజెడ్‌-పీఓడీ స్వయంచోదిత మోడల్ కారు. రోబోటిక్‌ ప్లాట్‌ఫాంపై నడిచే కారు కాబట్టి అటు ప్రయాణికులను, ఇటు వస్తువులను రవాణా చేయవచ్చు. 

ఆటోమొబైల్ పరిశ్రమ పరివర్తన సాధించడానికి నాలుగు ఇన్నోవేటివ్ వ్యూహాత్మక విధానాలు కీలకం కానున్నాయని రెనాల్ట్ తెలిపింది. వాటిల్లో ఎలక్ట్రిక్ మొబిలిటీ, కనెక్టెడ్ మొబిలిటీ, ఆటోనోమస్ మొబిలిటీ, న్యూ మొబిలిటీ సర్వీసెస్ ముఖ్యమైనవి కానున్నాయి. 

రెనాల్ట్ ఇండియా సీఈఓ కం ఎండీ మామిళ్లపల్లి వెంకట్రామ్ మాట్లాడుతూ తమ సంస్థ గ్లోబల్ మొబిలిటీ భవిష్యత్ అవసరాలపై ద్రుష్టి పెట్టిందన్నారు. అదే సమయంలో భారతదేశ మార్కెట్లో విస్తరణపై ఇన్నోవేటివ్ వ్యూహం అమలు చేయనున్నామని తెలిపారు. 
click me!